30, మే 2021, ఆదివారం

Indrudu-Chandrudu : Sandya Ragapu Sarigama Song Lyrics (సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో)

చిత్రం: ఇంద్రుడు-చంద్రుడు (1989 )

సాహిత్యం : వేటూరి

సంగీతం : ఇళయరాజా

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి


సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో సాయంకాలపు చలిచలి ఊహల పకపకలో డోరేమి రాగాల జోరేమి దసగ నా ప్రేమ నీ మీద శృతి కలిసిన చినుకు చినుకు నడుములో చిలకలులికి పడెనులే కనుల కనుల నడుమలో కలల సుడులు తిరిగెలే పెదవి పెదవి తడుపులో వలపు మధువు తొణికెలే తనువు తనువు కుదుపులో తమకమొకటి మెరిసెలే సంధ్యలో తారలాగ స్వప్నమైపోకుమా కన్నెలో సోయగాలు కంటితోనే తాగుమా హంసలా హాయిగా ఆమని రేయిలా వాలిపో ప్రియా... ఎదుటపడిన బిడియమే చెమట నుదుట చిలికెలే ఒణుకు తొణుకు పరువమే వడికి వయసు కలిపెలే వలపు పొడుపు కధలలో చిలిపి ముడులు విడెనులే మరుల విరుల పొదలలో మరుడి పురుడు జరిగెలే తేనెలే దోచుకెళ్ళే తుమ్మెదైపోకుమా బాలు: గాలికే గంధమిచ్చే కౌగిలింతే దూరమా జానకి : పాటల తోటలో పల్లవే ప్రేమగా పాడుకో ప్రియా


సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో సాయంకాలపు చలిచలి ఊహల పకపకలో డోరేమి రాగాల జోరేమి దసగ నా ప్రేమ నీ మీద శృతి కలిసిన


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి