చిత్రం: మరణ మృదంగం (1988)
సంగీతం: ఇళయరాజా
రచన: వేటూరి సుందరరామ మూర్తి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం ,పి. సుశీల
పల్లవి:
Female : కరిగిపోయాను కర్పూర వీణలా
కలిసిపోయాను నీ వంశధారలా
నా గుట్టు జారిపోతున్న నీ పట్టు చిక్కిపోతున్నా
Male : నీ తీగ వణికిపోతున్నా రాగాలు దోచుకుంటున్నా
కురిసిపోయింది ఓ సందె వెన్నెలా
నా గుట్టు జారిపోతున్న నీ పట్టు చిక్కిపోతున్నా
Male : నీ తీగ వణికిపోతున్నా రాగాలు దోచుకుంటున్నా
కురిసిపోయింది ఓ సందె వెన్నెలా
కలిసిపోయాక ఈ రెండు కన్నులా
చరణం 1 :
Female మనసుపడిన కథ తెలుసుగా ప్రేమిస్తున్నా తొలిగా
Male : పడుచు తపనలివి తెలుసుగా మన్నిస్తున్నా చెలిగా
Female ఏ ఆశలో ఒకే ధ్యాసగా
Male : ఏ ఊసులో ఇలా బాసగా
అనురాగాలనే బంధాలనే పండించుకోమని తపించగా Female : కరిగిపోయాను కర్పూర వీణలా
Male : కురిసిపోయింది ఓ సందె వెన్నెలా
Female: నా గుట్టు జారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నా
Male: నీ తీగ వణికిపోతున్నా రాగాలు దోచుకుంటున్నా
Female: కరిగిపోయాను కర్పూర వీణలా
Male :కురిసిపోయింది ఓ సందె వెన్నెలా
చరణం 2 :
Male : : అసలు మతులు చెడి జంటగా ఏమవుతామో తెలుసా
Female: జతలుకలిసి మనమొంటిగా ఏమైనా సరిగరిసా
Male : ఏ కోరికో శృతే మించగా
Female: ఈ ప్రేమలో ఇలా ఉంచగా అధరాలెందుకో అందాలలో నీ
ప్రేమలేఖలే లిఖించగా Male కురిసిపోయింది ఓ సందె వెన్నెలా
Female: కలిసిపోయాను నీ వంశధారలా
Male: నీ తీగ వణికిపోతున్నా రాగాలు దోచుకుంటున్నా
Female: నా గుట్టు జారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నా
Male : కురిసిపోయింది ఓ సందె వెన్నెలా
Female: కలిసిపోయాను నీ వంశధారలా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి