19, జూన్ 2021, శనివారం

Aavida Maa Aavide : Om Namami Andamma Song Lyrics (ఓం నమామీ అందమా)

చిత్రం : ఆవిడ మా ఆవిడే (1998)

సంగీతం : శ్రీ

రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: హరిహరన్ , కె.యస్.చిత్ర



ఓం నమామీ అందమా ఆనందమే అందించుమా ఓం నమామీ బంధమా నా నోములే పండించుమా కౌగిల్ల కారగారం చేరడానికి ఏ నేరం చెయ్యాలో మరీ నూరెల్లు నీ గుండెల్లొ ఉండడానికి ఏమేమి ఇయ్యలో మరీ ప్రాణమై చేరుకో ప్రియతమా ఓ ఓ ఓం నమామీ అందమా ఆనందమే అందించుమా ఓ సోనా సొగసు వీన నిలువునా నిను మీటనా నే రాన నర నరాన కలవరం కలిగించనా కల్లార నిన్నె చూస్తు ఎన్నొ కలలే కంటున్నా ఇల్లాగె నిత్యం ఆ కలోనే ఉండాలంటున్నా ఈ క్షణం శాస్వతం చెయ్యుమా ఓం నమామీ అందమా ఆనందమే అందించుమా నీ యెదలో ఊయలూగే ఊపిరి నాదే మరీ నా ఒడిలో హాయిలాగే అయినది ఈ జాబిలీ యెన్నెన్నొ జన్మాలెత్తి నేనె నేనై పుట్టాలి అన్నిట్లొ మల్లి నేనె నీతో నేస్తం కట్టాలి కాలమే ఏలుమా స్నేహమా ఓ ఓ ఓం నమామీ అందమా ఆనందమే అందించుమా ఓం నమామీ బంధమా నా నోములే పండించుమా కౌగిల్ల కారగారం చేరడానికి ఏ నేరం చెయ్యాలో మరీ నూరెల్లు నీ గుండెల్లొ ఉండడానికి ఏమేమి ఇయ్యలో మరీ ప్రాణమై చేరుకో ప్రియతమా ఓ ఓ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి