చిత్రం: డాడీ (2001)
రచన: భువన చంద్ర
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కవిత కృష్ణమూర్తి, అనురాధ శ్రీరామ్
సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్
పల్లవి):-
(He):- పట్టా పక్కింటి నాటు కోడి పెట్టనీ.. పెడతా ఎంచక్కా ఘాటు ప్రేమ బువ్వనీ.(x2)... (She):- అదిగో చూస్తుంది నిప్పురవ్వ.. ఐనా మోగించు ముద్దు మువ్వ.. సిగ్గే లేదమ్మ హవ్వ హవ్వా.. అమ్మో ఈ పిచ్చి పేరే లవ్వా.. (He):- గురివింద కి తన కిందనే మచ్చోటి ఉన్నదని తెలవదా చెలీ.. (She):- తన సంగతి మనకెందుకోయ్..కమ్మంగ కానుకిస్తా కన్నె కౌగిలీ.. (He):- రావే నా మల్లె పూల తట్టా.. పెట్టేయ్ ఎంచక్కా తేనె రొట్టా.. (She):- సిగ్గే లేదమ్మ హవ్వ హవ్వా.. అమ్మో ఈ పిచ్చి పేరే లవ్వా..... (చరణం.1):- (She):- ప్రేమించానని మత్తుగా పిచ్చెక్కించే వారిని నమ్మొద్దంటే వెక్కిరించుట న్యాయమా న్యాయమా... నువ్వొద్దన్న మనిషినీ.నే ప్రేమిస్తే తగదని.నీతులు చెప్పే నిన్ను మాత్రం నమ్మటం సులభమా.. కాకి కి కోయిల పాట నచ్చునా.కప్పకి పూవుల విలువ తెలియునా.. (He):- లోకుల మాటలు పక్కనెట్టవే.కమ్మని ముద్దుల విందు చేయవే..అసూయ కి లొంగని ఆడదేది ఈ జగాన.. (She):- రవ్వా రగిలింది తీపి తిక్క.వేయ్ నా వెన్నెల్లో పూల పక్క.. (He):- రావే నా పాల పొల్లు ముంత మామిడీ.చేస్తా సమ్మోహనంగా సోకు ముట్టడీ.. (She):- సిగ్గే లేదమ్మ హవ్వ హవ్వా.. అమ్మో ఈ పిచ్చి పేరే లవ్వా..... (చరణం.2):- (She):- రగిలే మనసు రగలనీ.పగిలే గుండెలు పగలనీ.. క్షణమైనా నిను వదలలేనోయ్ ప్రియతమా ప్రియతమా.. (He):- విరిసే మోగ్గా.ఉండగా విచ్చిన పువ్వు ఎందుకే..పాలూ నీరై కలిసి పోదాం ప్రాణమా ప్రాణమా... (She):- మంచని చెబితే నెత్తికెక్కునా.గుండెలు పగలగా బుద్ధి వచ్చునా.. (He):- వచ్చే వెన్నెల రాక మానదే.పోయే చీకటి పోక మానదే. ఏనాటికి మారదు.మారదే బ్రహ్మ రాత.. (She):- సిగ్గే లేదమ్మ హవ్వ హవ్వా.. అమ్మో ఈ పిచ్చి పేరే లవ్వా.. అమ్మో నేనాగలేను సుందరంగుడా..కోట్టేయ్ love stamp మీద ముద్దు.ముద్దు రా.. (He):- రావే నా సీమ రేగు పండా.. ఉంటా life అంతా నీకు అండా.. (She):- అదుగో చూస్తుంది రాతి బండా.. వేసెయ్ నా మెడ్లో పూల దండా.. (He):- నీ టేష్టుకి నా టేష్టుకి.కుదిరింది గొప్ప match కన్నె కోమలీ.. (She):- లోకానికి తెలియాలిగా. కొట్టెయ్ నా సామిరంగ కుర్ర కౌగిలీ.. (He):- రావే నా గండి పేట పువ్వా.. పెడతా ఎంచక్క ప్రేమ బువ్వా.. (She):- సిగ్గే లేదమ్మ హవ్వ హవ్వా.. అమ్మో ఈ పిచ్చి పేరే లవ్వా.....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి