చిత్రం: ఆయుధం (2003)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: కుమార్ సాను, రష్మీ
ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ఆ ఇంద్ర లోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా ముత్యమా ముత్యమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా ఓవింత కవ్వింత నీకంత చొరవా ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలిప్రేమ ఫలితమా పరువమా ప్రణయమా నీ చెలిమిలో తీపి మధురిమా ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ఆ ఇంద్ర లోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా శ్రీరంగా నిను కోరంగా ఈ గిలిగింతలు చలిలో చమటలు గారంగా నువు తేరంగా మదిలో మెరుపులు ఎధలో పరుగులు దాయి దాయి దాయి దామ్మా దరి దాయి దాయి దాయి దామ్మా పాపలయ్యి పాడుకుందామా చేపలల్లే ఈదుకుందామా గుండె బావి తొడుకుందామా ఈడు దాహం తీర్చుకుందామా నీళ్లలోనే మనముంటున్నా తీరని దాహాలేంటమ్మా ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ఆ ఇంద్ర లోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా వేసవిలో నిను చూస్తుంటే చలివేస్తున్నది చెలి ఏంటే ఇది వేకువలో నువులేకుంటే వెలుగే ఎలుగుతూ రానంటున్నది దాయి దాయి దాయి దామ్మా దరి దాయి దాయి దాయి దామ్మా తాజమహల్ చేరుకుందామా లవ్ గజల్ పాడుకుందామా తారలన్నీ తెంచుకుందామా తోరణాలే కట్టుకుందామా ఓ చంద్రమండల వీధుల్లోన చెలియా మీటే అవుదామా ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ఆ ఇంద్ర లోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా ముత్యమా ముత్యమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా ఓవింత కవ్వింత నీకంత చొరవా ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలిప్రేమ ఫలితమా పరువమా ప్రణయమా నీ చెలిమిలో తీపి మధురిమా లాల లాల లాలా లాలా లాల లాలాలా లాల లాల లాలా లాలా లాల లాలాలా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి