17, జూన్ 2021, గురువారం

Pelli Sandadi : Nava Manmadhuda Song Lyrics (నవమన్మథుడా అతిసుందరుడా )

 

చిత్రం : పెళ్లి సందడి సంగీతం: M.M.కీరవాణి సాహిత్యం: సామవేదం షణ్ముఖశర్మ గానం: చిత్ర


పల్లవి:

నవమన్మథుడా అతిసుందరుడా నువ్వు చూసిన ఆ ఘనుడు అక్కా ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు శ్రీరాఘవుడా ప్రియ మాధవుడా నువ్వు వలచిన ఆ ప్రియుడు చెల్లీ ఎవరే అతగాడు తుళ్ళే నీ వయసుకు జతగాడు చరణం:1 గోరు వెచ్చని ఊపిరే వేయి వేణువులూదగా తొలిముద్దు చిందించెనే వీణ మీటిన తీరుగా ఒళ్ళు ఝల్లనే హాయిగా బిగి కౌగిలందించెనే రతి రాగాలే శృతి చేశాడే జత తాళాలే జతులాడాడే తనువంతా వింత సంగీతమేదో పలికే అక్కా ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు శ్రీరాఘవుడా ప్రియ మాధవుడా నువ్వు వలచిన ఆ ప్రియుడు చెల్లీ ఎవరే అతగాడు తుళ్ళే నీ వయసుకు జతగాడు చరణం:2 వాడి చూపుల దాడితో వేడి ఆవిరి రేపెనే నిలువెల్లా తారాడెనే చాటు మాటున చోటులో ఘాటు కోరికలూపెనే ఒడిచేరి తలవాల్చెనే జడ లాగాడే కవ్వించాడే నడుమొంపుల్లో చిటికేశాడే అధరాలతోనే శుభలేఖ రాసే మరుడే చెల్లీ ఎవరే అతగాడు తుళ్ళే నీ వయసుకు జతగాడు నవమన్మథుడా అతిసుందరుడా నువ్వు చూసిన ఆ ఘనుడు అక్కా ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు శ్రీరాఘవుడా ప్రియ మాధవుడా నువ్వు వలచిన ఆ ప్రియుడు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి