3, జూన్ 2021, గురువారం

Tholi Prema : Gagananiki Song Lyrics (గగనానికి ఉదయం ఒకటే)

 

చిత్రం: తొలిప్రేమ (1998)
సంగీతం:  దేవా
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: బాలసుబ్రహ్మణ్యం


పల్లవి: గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే ప్రణయానికి నిలయం మనమై యుగయుగముల పయనం మనమై ప్రతిజన్మలో కలిశాం మనమే మనమే జన్మించలేదా నీవు నా కోసమే గుర్తించలేదా నన్ను నా ప్రాణమే ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ... గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే చరణం:1 నీ కన్నుల్లో కలను అడుగు ఇతడు ఎవరనీ నీ గుండెల్లో పెరిగే లయనే బదులు పలకనీ నిదురించు యవ్వనంలో పొద్దుపొడుపై కదిలించలేదా నేనే మేలుకొలుపై గతజన్మ జ్ఞాపకాన్నై నిన్ను పిలువా పగడాల మంచు పొరలో ఉండగలనా గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే చరణం:2 నా ఊహల్లో కదిలే కడలే ఎదుట పడినవి నా ఊపిరిలో ఎగసే సెగలే కుదుట పడినవి సమయాన్ని శాశ్వతంగా నిలిచిపోనీ మమతన్న అమృతంలో మునిగిపోనీ మనవైన ఈ క్షణాలే అక్షరాలై మృతి లేని ప్రేమకథగా మిగిలిపోనీ గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే ప్రణయానికి నిలయం మనమై యుగయుగముల పయనం మనమై ప్రతిజన్మలో కలిశాం మనమే మనమే జన్మించలేదా నీవు నాకోసమే గుర్తించలేదా నన్ను నా ప్రాణమే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి