చిత్రం: అల్లరి మొగుడు (1992)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
రేపల్లె మళ్ళీ మురళి విన్నది..
ఆ పల్లె కళే పలుకుతున్నది...
ఆ జానపదం ఘల్లు మన్నది..
ఆ జాణ జతై అల్లుకున్నది...
మొగలిపువ్వు మారాజుకి మొదటి కానుక
ఎదను పరిచి వేసెయ్యనా ప్రణయ వేదిక
మల్లెనవ్వు మా రాణి ఈ గొల్ల గోపిక
మూగ మనసు వింటున్నది మురళిగీతిక...
రేపల్లె మళ్ళీ మురళి విన్నది..
ఆ పల్లె కళే పలుకుతున్నది...
తాననతందానన.. తజుమ్ తజుమ్ జుమ్
తాననతందానన.. తజుమ్ తజుమ్.. తజుమ్ తజుమ్
ఆ పెంకితనాల పచ్చిగాలి ఇదేనా
పొద్దుపోని ఆ ఈల ఈ గాలి ఆలాపన
ఆ కరుకుతనాల కన్నె మబ్బు ఇదేనా
ఇంతలో చిన్నారి చినుకై చెలిమే చిలికేనా
అల్లరులన్ని పిల్లనగ్రోవికి స్వరములిచ్చేనా
కళ్ళెర్ర జేసి కిన్నెరసానికి సరళి నచ్చేనా
మెత్తదనం... తందానన... మెచ్చుకుని ...
గోపాలకృష్ణయ్య గారాలు చెల్లించనా
రేపల్లె మళ్ళీ మురళి విన్నది..
ఆ పల్లె కళే పలుకుతున్నది...
మొగలిపువ్వు మారాజుకి మొదటి కానుక
మూగ మనసు వింటున్నది మురళిగీతిక
నీ గుండె వినేలా వెంట వెంట ఉండేలా
గొంతులోని రాగాలు పంపాను ఈ గాలితో
ఆ ప్రేమ పదాల గాలిపాట స్వరాల పోల్చుకుని
కలిపేసుకున్నాను నా శ్వాసలో
ఎక్కడ ఉన్నా ఇక్కడ తిన్న వెన్నే వెణువయ్యె
కొంగును లాగే కొంటేతనాలే కంటికి వేలుగయ్యే
వన్నెలలో తందనానా. .వెన్నెలలే
వెచ్చని వెల్లువలయ్యె వరసిది
రేపల్లె మళ్ళీ మురళి విన్నది..
ఆ పల్లె కళే పలుకుతున్నది...
ఆ జానపదం ఝల్లు మన్నది ..
ఆ జాణ జతై అల్లుకున్నది...
మొగలిపువ్వు మారాజుకి మొదటి కానుక
ఎదను పరిచి వేసెయ్యనా ప్రణయ వేదిక
మల్లెనవ్వు మా రాణి ఈ గొల్ల గోపిక
మూగ మనసు వింటున్నది మురళిగీతిక
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి