చిత్రం: అల్లరి ప్రియుడు ( 1993 )
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
పల్లవి :
అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు
అహో తన పల్లవి పాడే చల్లని రోజు
ఇదే ఇదే కుహూ స్వరాల కానుక
మరో వసంత గీతిక జనించు రోజు
చరణం 1 :
మాట పలుకు తెలియనిది మాటున ఉండే మూగ మది కమ్మని తలపుల కావ్యమయె కవితలు రాసే మౌనమది రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమది శృతిలయలెరుగని ఊపిరికి స్వరములు కూర్చే గానమది ఋతువుల రంగులు మార్చేది కల్పన కలిగిన మది భావం బ్రతుకును పాటగ మలిచేది మనసున కదిలిన మృదునాదం కలవని దిక్కులు కలిపేది నింగిని నేలకు దింపేది తనే కదా వారధి క్షణాలకే సారధి మనస్సనేది
చరణం 2:
చూపులకెన్నడు దొరకనిది రంగు రూపు లేని మది రెప్పలు తెరవని కన్నులకు స్వప్నాలెన్నో చూపినది వెచ్చని చెలిమిని పొందినది వెన్నెల కళగల నిండు మది కాటుక చీకటి రాతిరికి బాటను చూపే నేస్తమది చేతికి అందని జాబిలిలా కాంతులు పంచే మణిదీపం కొమ్మల చాటున కోయిలలా కాలం నిలిపే అనురాగం అడగని వరములు కురిపించి అమృతవర్షిని అనిపించే అమూల్యమైన పెన్నిధి శుభోదయాల సన్నిధి మనస్సనేది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి