Allari Priyudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Allari Priyudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, డిసెంబర్ 2024, శనివారం

Allari Priyudu : Uttaraala urvasi.. song lyrics (ఉత్తరాల ఉర్వశి ప్రేమలేఖ ప్రేయసి )

చిత్రం: అల్లరి ప్రియుడు ( 1993 )

రచన: వేటూరి సుందరరామ మూర్తి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



పల్లవి :

ఉత్తరాల ఉర్వశి ప్రేమలేఖ ప్రేయసి 

అందమంత అక్షరాల హారతివ్వగ 

హల హలా అదెంత వేడివెన్నెలా, 

ముఖాముఖి ముడేసుకున్న ముద్దులా 

గీతగోవిందుడు వీనులావిందుడు 

రాగమాలతోనె రాసలీలలాడగా 

మజా మజా మాజా గుమాగుమాలయా, 

నిజానికి ఇదంత ఒట్టు నీ దయా


చరణం 1 :

పువ్వులెన్నొవిచ్చినట్టుగ చెలి నవ్వగానె నచ్చినావులే

చుక్కలెన్నొపుట్టినట్టుగ ప్రియా చూసుకోర పట్టి కౌగిలీ 

ఖవ్వాలిల కన్నులతోనే జవానీల జాబులురాసే 

జగడమొకటి సాగిందోయమ్మో   

అజంతాల ప్రాసలు వేసి వసంతాల ఆశలురేపి 

లలిత కవిత నీకేపాలగా 

దోరసోకు తోరణాలు కౌగిలింత కారణాలై 

వంశధారనీటిమీద  హంసలేఖరాసినా    

ఉత్తరాల ఉర్వశి ప్రేమలేఖ ప్రేయసి 

అందమంత అక్షరాల హారతివ్వగ 

హల హలా అదెంత వేడివెన్నెలా  

నిజానికి ఇదంతా ఒట్టు నీ దయా


చరణం 2:

సమ్ముఖాన రాయభారమా, సరే, సందేగాలి ఒప్పుకోదులే 

చందమామతోటి బేరమా, అదీ, అందగత్తె గొప్పకాదులే 

పెదాలమ్మ కచ్చేరీలో పదాలింక కవ్విస్తుంటే 

హృదయమొకటి పుట్టిందోయమ్మా 

సరాగాల సంపెంగల్లో పరాగాలు పండిస్తుంటే, 

పరువమొకటి వచ్చే వాంఛలా 

కన్నె చెట్టు కొమ్మ మీద పొన్న తోట తుమ్మెదాడి 

ఝుంటితేని పట్టులోన కొంటె వేణువూదిన

గీతగోవిందుడు వీనులావిందుడు 

రాగమాలతోనె రాసలీలలాడగా 

మజా మజా మాజా గుమాగుమాలయా, 

నిజానికి ఇదంత ఒట్టు నీ దయా


ఉత్తరాల ఉర్వశి ప్రేమలేఖ ప్రేయసి 

అందమంత అక్షరాల హారతివ్వగ 

హల హలా అదెంత వేడివెన్నెలా, 

ముఖాముఖి ముడేసుకున్న ముద్దులా 

2, జూన్ 2021, బుధవారం

Allari Priyudu : Pranayama Nee Peremiti Song Lyrics (ప్రణయమా నీ పేరేమిటి ప్రాణమా)

చిత్రం: అల్లరి ప్రియుడు ( 1993 )

రచన: వెన్నెలకంటి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: ఎం. ఎం. కీరవాణి


పల్లవి :

ప్రణయమా నీ పేరేమిటి ప్రాణమా ప్రణయమా నీ పేరేమిటి ప్రళయమా గమ్యం తెలియని పయనమా ప్రేమకు పట్ట్టిన గ్రహణమా తెలుపుమా తెలుపుమా తెలుపుమా ప్రణయమా నీ పేరేమిటి ప్రాణమా ప్రణయమా నీ పేరేమిటి ప్రళయమా గమ్యం తెలియని పయనమా ప్రేమకు పట్ట్టిన గ్రహణమా తెలుపుమా తెలుపుమా తెలుపుమా

చరణం 1 :

ప్రేమ కవితా గానమా నా ప్రాణమున్నదీ శృతి లేదా గేయమే యద గానమైనది వలపు చితిని రగిలించగా తీగ చాటున రాగమ ఈ దేహమునంది జతలేకా దాహమారని స్నేహమై యద శిధిల శిశిరమై మారగా ఓ హృదయమా.. ఇది సాధ్యమా... రెండుగ గుండె చీలునా.. ఇంక ఎందుకు శోధన ఇంక ఎందుకు శోధన తెలుపుమా తెలుపుమా తెలుపుమా ప్రణయమా నీ పేరేమిటి ప్రాణమా ప్రణయమా నీ పేరేమిటి ప్రళయమా గమ్యం తెలియని పయనమా ప్రేమకు పట్ట్టిన గ్రహణమా తెలుపుమా తెలుపుమా తెలుపుమా

చరణం 2:

ప్రేమ సాగర మధనమే జరిగింది గుండెలో ఈ వేళ రాగమన్నది త్యాగమైనది చివరికెవరికి అమృతం తీరమెరుగని కెరటమై చెలరేగు మనసులో ఈవేళ అశ్రుధారలే అక్షరాలుగా అనువదించే నా జీవితం ఓ ప్రాణమా.. ఇది న్యాయమా... రాగం అంటే త్యాగమా వలపుకు ఫలితం శూన్యమా వలపుకు ఫలితం శూన్యమా తెలుపుమా తెలుపుమా తెలుపుమా ప్రణయమా నీ పేరేమిటి ప్రాణమా ప్రణయమా నీ పేరేమిటి ప్రళయమా గమ్యం తెలియని పయనమా ప్రేమకు పట్ట్టిన గ్రహణమా తెలుపుమా తెలుపుమా తెలుపుమా

Allari Priyudu : Andama Nee Peremiti Song Lyrics (అందమా నీ పేరేమిటి అందమా)

చిత్రం: అల్లరి ప్రియుడు ( 1993 )

రచన: వేటూరి సుందరరామ మూర్తి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: ఎం. ఎం. కీరవాణి


పల్లవి :
అందమా నీ పేరేమిటి అందమా ఒంపుల హంపి శిల్పమా బాపు గీసిన చిత్రమా తెలుపుమా తెలుపుమా తెలుపుమా పరువమా నీ ఊరేమిటి పరువమా కృష్ణుని మధురా నగరమా కృష్ణ సాగర కెరటమా తెలుపుమా తెలుపుమా తెలుపుమా
చరణం 1 : ఏ రవీంద్రుని భావమో గీతాంజలి కళ వివరించే ఎండ తాకని పండు వెన్నెల గగనమొలికే నా కన్నుల ఎంకి పాటల రాగమే గోదారి అలలపై నిదురించే మూగబోయిన రాగమాలిక ముసిరెనిపుడు నా గొంతున సంగీతమా నీ నింగిలో విరిసిన స్వరములే ఏడుగా వినబడు హరివిల్లెక్కడ తెలుపుమా తెలుపుమా తెలుపుమా
చరణం 2: భావకవితల బరువులో ఆ కృష్ణశాస్త్రిలా కవినైతే హాయి రెమ్మల కోయిలమ్మకు విరుల ఋతువు వికసించదా తుమ్మెదడగని మధువులే చెలి సాకి వలపులే చిలికిస్తే మాయ జగతికి ఏ ఖయామో మధుర కవిత వినిపించడా ఓ కావ్యమా నీ తోటలో నవరస పోషనే గాలిగా నవ్వినా పూలే మాలగా పూజకే సాధ్యమా తెలుపుమా

Allari Priyudu : Em Pilladi Song Lyrics (ఏం పిల్లది ఎంత మాటన్నది)

చిత్రం: అల్లరి ప్రియుడు ( 1993 )

రచన: వేటూరి సుందరరామ మూర్తి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

పల్లవి : ఏం పిల్లది ఎంత మాటన్నది ఏం కుర్రది కూత బాగున్నది ఓయ్ సిగ్గులపురి చెక్కిలి తనకుంది అంది చెక్కిలి పై కెంపులు నా సొంతం అంది ఎక్కడ ఏం చెయ్యాలో నేర్పమన్నది బాగున్నది కోడె ఈడన్నది ఈడందుకే వీధి పాలైనది కమ్మని కల కళ్ళెదుటకు వచ్చేసింది కొమ్మకు జత వీడేనని ఒట్టేసింది ఎప్పుడు ఏం కావాలో అడగమన్నది ఏం పిల్లది ఎంత మాటన్నది... బాగున్నది కోడె ఈడన్నది చరణం 1 : శనివారం ఎంకన్న సామి పేరు చెప్పి ... సెనగలట్టు చేత బెట్టి సాగనంపింది మంగళారం ఆంజనేయ సామి పేరు జెప్పి... అసలు పనికి అడ్డమెట్టి తప్పుకున్నాది ఇనుకొని ఆరాటం ఇబ్బంది ... ఇడమరిసే ఈలెట్టా వుంటుంది ఎదలోన ఓ మంట పుడుతుంది... పెదవిస్తే అది కూడా ఇమ్మంటుంది చిరు ముద్దుకి ఉండాలి చీకటి అంది.. ఏ కళ్ళు పడకుంటే ఓకే అంది తీరా ముద్దిస్తుంటే ఎంగిలన్నది ఏం పిల్లది ఎంత మాటన్నది... బాగున్నది కోడె ఈడన్నది చరణం 2 : సుక్రారం మాలచ్చిమి నీకు సాటి అంటూ ... పట్టు చీర తెచ్చి పైట చుట్టమన్నాడు సోమారం జామురాతిరి తెల్ల చీర తెచ్చి... మల్లెపూల కాపడాలు పెట్టమన్నాడు ఉత్సాహం ఆపేది కాదంట... ఉబలాటం కసిరేస్తే పోదంట ఉయ్యాల జంపాల కథలోనే 'ఉ ' కొట్టే ఉద్యోగం నాదంట వరసుంటే వారంతో పని ఏముంది ఉత్తుత్తి చొరవైతే ఉడుకేముంది మళ్ళీ కావాలన్నా మనసు ఉన్నది అమ్మో.. ఏం పిల్లది ఎంత మాటన్నది... బాగున్నది కోడె ఈడన్నది సిగ్గులపురి చెక్కిలి తనకుంది అంది... కొమ్మకు జత వీడేనని ఒట్టేసింది ఎక్కడ ఏం చెయ్యాలో నేర్పమన్నది ఏం పిల్లది ఎంత మాటన్నది... బాగున్నది కోడె ఈడన్నది

Allari Priyudu : Rose Rose Roja Puvva Song Lyrics(రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజాపువ్వా)

 చిత్రం: అల్లరి ప్రియుడు ( 1993 )

రచన: వేటూరి సుందరరామ మూర్తి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి


పల్లవి :

రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజాపువ్వా రోజాపువ్వా పువ్వా పువ్వా రోజూ రోజూ రోజూ రోజూ పూస్తూ ఉన్నా పువ్వే నువ్వా నవ్వే నువ్వా రేకు విచ్చుకున్న సోకుబంతి పువ్వే నువ్వా ముద్దు పెట్టకుండ ఘల్లు మన్న మువ్వే నువ్వా పడుచుతనపు గడుసు వలపు పాటవు నువ్వా భామా..

చరణం 1 :

చక్కదనానికి చెక్కిలి గింతవు నువ్వా నువ్వా కందే పువ్వా కన్నే పువ్వా వెన్నెల వాకిట ఎర్రగ పండిన దివ్వే నువ్వా చిందే నవ్వా పొద్దే నువ్వా గుందె చాటు ప్రేమలెన్నో పోటు మీద చాటుతున్న రోజ పువ్వా అందమైన ఆడపిల్ల బుగ్గ పండు గిల్లుకున్న సిగ్గే నువ్వా చిగురు ఎరుపు తెలుపు పొగడమాలిక నువ్వా.... చరణం 2 :

ప్రేమ సువాసన పెదవుల వంతెన వెఏఎనువ్వే ఫూసే పువ్వా బాసే నువ్వా కౌగిలి చాటున కాముడు మీటిన వీణే నువ్వా ఝనె నువ్వ జజె నువ్వ గుప్పు మన్న ఆశలెన్నో కొప్పులోన దాచుకున్న రోజ పువ్వా సందెపొద్దు సంతకాల ప్రేమ లేఖ పంపుకున్న గువ్వే నువ్వా మధుర కవిత చదివి పెదవి పండిన పువ్వా....



Allari Priyudu : Aho Oka Manasuku Nede Puttina Roju Song Lyrics (అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు)

చిత్రం: అల్లరి ప్రియుడు ( 1993 )

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి


పల్లవి :

అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు అహో తన పల్లవి పాడే చల్లని రోజు ఇదే ఇదే కుహూ స్వరాల కానుక మరో వసంత గీతిక జనించు రోజు

చరణం 1 :

మాట పలుకు తెలియనిది మాటున ఉండే మూగ మది కమ్మని తలపుల కావ్యమయె కవితలు రాసే మౌనమది రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమది శృతిలయలెరుగని ఊపిరికి స్వరములు కూర్చే గానమది ఋతువుల రంగులు మార్చేది కల్పన కలిగిన మది భావం బ్రతుకును పాటగ మలిచేది మనసున కదిలిన మృదునాదం కలవని దిక్కులు కలిపేది నింగిని నేలకు దింపేది తనే కదా వారధి క్షణాలకే సారధి మనస్సనేది

చరణం 2:

చూపులకెన్నడు దొరకనిది రంగు రూపు లేని మది రెప్పలు తెరవని కన్నులకు స్వప్నాలెన్నో చూపినది వెచ్చని చెలిమిని పొందినది వెన్నెల కళగల నిండు మది కాటుక చీకటి రాతిరికి బాటను చూపే నేస్తమది చేతికి అందని జాబిలిలా కాంతులు పంచే మణిదీపం కొమ్మల చాటున కోయిలలా కాలం నిలిపే అనురాగం అడగని వరములు కురిపించి అమృతవర్షిని అనిపించే అమూల్యమైన పెన్నిధి శుభోదయాల సన్నిధి మనస్సనేది