చిత్రం: అల్లరి ప్రియుడు (1996)
సంగీతం: M.M.కీరవాణి
సాహిత్యం: భువనచంద్ర
గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
పల్లవి: కనులు విప్పి కలువ మొగ్గ జాబిల్లిని చూచెను తమకంతో పాలబుగ్గ తొలిముద్దును కోరెను తడియారని పెదవులపై తొణికిన వెన్నెల మెరుపులు చెప్పకనే..చెప్పకనే.. చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని.. చరణం: చిలిపిగ నీ చేతులు అణువణువు తడుముతుంటే మోహపు తెరలిక తొలిగేనా...అహా..అహా..అహ చలి చలి చిరు గాలులు గిలిగింత రేపుతుంటే ఆశల అల్లరి అణిగేనా..అహా..అహా..అహా పదాలతోనే వరించనా సరాగ మాలై తరించనా స్వరాలతోనే స్పృశించనా సుఖాల వీణ శృతించనా ఆ వెన్నెల నీ కన్నుల రేపెక్కిన ఆ కోరిక పొగలై సెగలై యెదలో రగిలిన క్షణమే....ఏ..ఏ..ఏ చెప్పకనే..చెప్పకనే.. చెప్పకనే చెబుతున్నవి యిదే యిదే ప్రేమని చెప్పకనే చెబుతున్నవి యిదే యిదే ప్రేమని చరణం : తనువును పెనవేసిన నీ చీరకెంత గర్వం యవ్వన గిరులను తడిమెననా నీ కౌగిట నలిగినందుకే అంత గర్వం మదనుడి మలుపులు తెలిసెననీ తెల్లారనీకే ఒయ్యారమా అల్లాడిపోయే యీ రేయిని సవాలు చేసే శృంగారమా సంధించమాకే ఓ హాయిని ఆ మల్లెల కేరింతలు నీ నవ్వుల లాలింతలు వలలై అలలై ఒడిలో ఒదిగిన క్షణమే చెప్పకనే..చెప్పకనే.. చెప్పకనే చెబుతున్నవి యిదే యిదే ప్రేమని చెప్పకనే చెబుతున్నవి యిదే యిదే ప్రేమని
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి