2, జూన్ 2021, బుధవారం

Allari Priyudu : Pranayama Nee Peremiti Song Lyrics (ప్రణయమా నీ పేరేమిటి ప్రాణమా)

చిత్రం: అల్లరి ప్రియుడు ( 1993 )

రచన: వెన్నెలకంటి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: ఎం. ఎం. కీరవాణి


పల్లవి :

ప్రణయమా నీ పేరేమిటి ప్రాణమా ప్రణయమా నీ పేరేమిటి ప్రళయమా గమ్యం తెలియని పయనమా ప్రేమకు పట్ట్టిన గ్రహణమా తెలుపుమా తెలుపుమా తెలుపుమా ప్రణయమా నీ పేరేమిటి ప్రాణమా ప్రణయమా నీ పేరేమిటి ప్రళయమా గమ్యం తెలియని పయనమా ప్రేమకు పట్ట్టిన గ్రహణమా తెలుపుమా తెలుపుమా తెలుపుమా

చరణం 1 :

ప్రేమ కవితా గానమా నా ప్రాణమున్నదీ శృతి లేదా గేయమే యద గానమైనది వలపు చితిని రగిలించగా తీగ చాటున రాగమ ఈ దేహమునంది జతలేకా దాహమారని స్నేహమై యద శిధిల శిశిరమై మారగా ఓ హృదయమా.. ఇది సాధ్యమా... రెండుగ గుండె చీలునా.. ఇంక ఎందుకు శోధన ఇంక ఎందుకు శోధన తెలుపుమా తెలుపుమా తెలుపుమా ప్రణయమా నీ పేరేమిటి ప్రాణమా ప్రణయమా నీ పేరేమిటి ప్రళయమా గమ్యం తెలియని పయనమా ప్రేమకు పట్ట్టిన గ్రహణమా తెలుపుమా తెలుపుమా తెలుపుమా

చరణం 2:

ప్రేమ సాగర మధనమే జరిగింది గుండెలో ఈ వేళ రాగమన్నది త్యాగమైనది చివరికెవరికి అమృతం తీరమెరుగని కెరటమై చెలరేగు మనసులో ఈవేళ అశ్రుధారలే అక్షరాలుగా అనువదించే నా జీవితం ఓ ప్రాణమా.. ఇది న్యాయమా... రాగం అంటే త్యాగమా వలపుకు ఫలితం శూన్యమా వలపుకు ఫలితం శూన్యమా తెలుపుమా తెలుపుమా తెలుపుమా ప్రణయమా నీ పేరేమిటి ప్రాణమా ప్రణయమా నీ పేరేమిటి ప్రళయమా గమ్యం తెలియని పయనమా ప్రేమకు పట్ట్టిన గ్రహణమా తెలుపుమా తెలుపుమా తెలుపుమా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి