చిత్రం: అన్నమయ్య సంగీతం: M.M.కీరవాణి గానం: బాలసుబ్రహ్మణ్యం సాహిత్యం: అన్నమయ్య
గోవిందా నిశ్చలానంద మందార మకరంద నీ నామం మధురం నీ రూపం మధురం నీ సరస శృంగార కేళి మధురాతి మధురం స్వామి ఆహా ఏమొకొ ఏమొకొ చిగురుటధరమున యెడ నెడ కస్తురి నిండెనో భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా ఏమొకొ ఏమొకొ చిగురుటధరమున యెడ నెడ కస్తురి నిండెనో కలికి చకోరాక్షికి కడ కన్నులు కెంపై తోచిన చెలువంబిప్పుడి దేమొ చింతింపరే చెలులు నలువునప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులు నలువునప్రణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులు నిలువున పెరుకగ నంటిన నెత్తురు కాదు కదా ఏమొకొ ఏమొకొ చిగురుటధరమున యెడ నెడ కస్తురి నిండెనో జగడపు చనువుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనువుల జాజర తరిక జం జం జం జం జం జం కిదదధకిత్ధుం మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున జల్లన పుప్పొడి జారగ పతిపై జల్లే రతివలు జాజర జగడపు చనువుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనువుల జాజర త దనక్ త జనక్ త ధినిక్థ దధీంథనకథీం బారపు కుచములపైపై కడుసింగారం నెరపెడు గంద వొడి చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర జగడపు చనువుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనువుల జాజర తక్తధిం తజనుతన్ కిద్దతకిత్ధుం తక్తధీమజనుతధీం తకిద్థొం తధి తజనొ తనజను తజను తక్ధీంగింతధక్ధీంగినతధతకిదదద బింకపు కూటమి పెనగేటి చెమటల పంకపు పూతల పరిమళము వేంకటపతిపై వెలదులు నించేరు సంకుమదంబుల జాజర జగడపు చనువుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనువుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనువుల జాజర జగడపు చనువుల జాజర జగడపు చనువుల జాజర ....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి