10, జూన్ 2021, గురువారం

Annamayya Songs : Ele Ele Maradala Song Lyrics (ఏలే ఏలే మరదలా.. వాలే వాలే వరసలా)

 

చిత్రం: అన్నమయ్య

సంగీతం: M.M.కీరవాణి

గానం: బాలసుబ్రహ్మణ్యం, సుజాత, అనురాధ

సాహిత్యం: వేటూరి


ఏలే ఏలే మరదలా.. వాలే వాలే వరసలా నచ్చింది నచ్చింది నాజూకు.. నీకే ఇస్తా సోకులు ఇచ్చెయ్యి పచ్చారు సొగసులు చాలు నీ తోటి.. అహ.. చాలు నీ తోటి సరసాలు బావ ఏలే ఏలే మరదలా..  వాలే వాలే వరసలా  చరణం 1 : గాటపు గుబ్బలు కదలగ కులికేవు మాటల తేటల మరదలా వేటరి చూపులు విసురుచు మురిసేవు వాటపు వలపుల వరదలా చీటికి మాటికి చణకేవూ... ఊ ... చీటికి మాటికి చణకేవు వట్టి బూటకాలు మాని పోవే బావా చాలు చాలు నీ తోటి.. అహ చాలు నీ తోటి సరసాలు బావ ఏలే ఏలే మరదలా... వాలే వాలే వరసలా నచ్చింది నచ్చింది నాజూకు... నీకే ఇస్తా సోకులు ఇచ్చెయ్యి పచ్చారు సొగసులు చాలు నీ తోటి.. అహ..  చాలు నీ తోటి సరసాలు బావ ఏలే ఏలే మరదలా... వాలే వాలే వరసలా  చరణం 2 : కన్నుల గంటపు కవితలు గిలికేవు నా యెద చాటున మరదలా పాడని పాటల పయిటలు సరిదేవు పల్లవి పదముల దరువులా కంటికి వంటికి కలిపేవూ... ఊ.... కంటికి వంటికి కలిపేవు ఎన్ని కొంటె లీలలంట కోలో బావా అహ పాడుకో పాట.. జంట పాడుకున్న పాట జాజిపూదోట ఏలే ఏలే మరదలా.. వాలే వాలే వరసలా నచ్చింది నచ్చింది నాజూకు.. నీకే ఇస్తా సోకులు ఇచ్చెయ్యి పచ్చారు సొగసులు చాలు నీ తోటి.. అహ.. చాలు నీ తోటి సరసాలు బావ ఏలే ఏలే మరదలా..  వాలే వాలే వరసలా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి