చిత్రం : బావ బావమరిది (1993) గానం : బాలు, చిత్ర రచన : వేటూరి సంగీతం : రాజ్ - కోటి
ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో
ఉత్తరాలు రాయజాలని ప్రేమలో
కలత నిదర చెదిరే తొలి కలల వలపు ముదిరే
కొత్త కొత్తందాలు మత్తెక్కించే జోరులో
ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో
ఉత్తరాలు రాయజాలని ప్రేమలో
ఈ కన్నె లేతందాలే ఏతాలేసి తోడుకో
నా సిగ్గు పూతల్లోన తేనె జున్ను అందుకో
ఈ పొద్దు వద్దంటున్న మోమాటాల పక్కనే
ఓ ముద్దు ముద్దంటాయి ఆరాటాలు ఎక్కడో
చేరుకో పొదరిల్లకి చీకటి చిరుతిల్లకి
అలకాపురి చిలకమ్మకి కులుకెందుకో ఒకసారికి
ఒళ్ళే వేడెక్కింది గిల్లికజ్జా ప్రేమకి
ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో ఉత్తరాలు రాయజాలని ప్రేమలో
మంచమ్మ ముంగిళ్ళల్లో దీపాలెట్టి చూసుకో
సందేల మంచాలేసి సంకురాత్రి చేసుకో
మామల్లే మాగాణుల్లో మాసులంత చేసుకో
పూబంతి పూవందాలు బందీకట్టి వెళ్లిపో
పూటకో పులకింతగా జంటగా పురి విప్పుకో
మరుమల్లెల మహారాజుకి తెరచాటుల ప్రతి రోజుకి
ఆపేదెట్టాగంటా పువ్వైపోయే రెమ్మని
ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో
ఉత్తరాలు రాయజాలని ప్రేమలో
కలత నిదర చెదిరే తొలి కలల వలపు ముదిరే
కొత్త కొత్తందాలు మత్తెక్కించే జోరులో
ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో
ఉత్తరాలు రాయజాలని ప్రేమలో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి