Bombay Priyudu : Chethilona Song Lyrics ( చేతిలోన చెయ్యేసి చెప్పేయవా)
చిత్రం : బొంబాయి ప్రియుడు(1996)
సంగీతం: M.M.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: బాలసుబ్రహ్మణ్యం, ప్రతిమ రావు
పల్లవి : చేతిలోన చెయ్యేసి చెప్పేయవా నను ఎన్నడూ విడిపోనని ప్రేమమీద ఒట్టేసి చెప్పేయవా నను వీడని జత నీవని చేతిలోన చెయ్యేసి చెప్పేయవా నను ఎన్నడూ విడిపోనని ప్రేమమీద ఒట్టేసి చెప్పేయవా నను వీడని జత నీవని ప్రతిక్షణం ప్రేమలో పరీక్షలే వచ్చినా తలరాతకు తలవంచదు ప్రేమ... ఆ... చేతిలోన చెయ్యేసి చెప్పేయవా నను ఎన్నడూ విడిపోనని చరణం : 1 నీవు నేనులే మనస్సు ఒక్కటే ఇద్దరైన ఈ మమకారంలో నీవు నేననే పదాలు లేవులే ఏకమైన ఈ ప్రియమంత్రంలో నా గుండెలో కోకిల నీ గొంతులో పాడగా నా జన్మ ఓ పూవులా నీ కొమ్మలో పూయగా కల ఇలా కౌగిలై తనే కలే వెన్నెలై చేయి కలిపిన చెలిమే అనురాగం... ఆ... "చేతిలోన" చరణం : 2 నిన్నుతాకితే దేవతార్చన పూజలందుకో పులకింతల్లో వాలు చూపులే వరాల దీవెన నన్ను దాచుకో కనుపాపల్లో నా ప్రేమ గీతానికి నీవేలే తొలి అక్షరం నా ప్రేమ పుట్టింటికి నీవేలే దీపాంకురం రసానికో రాగమై రచించని కావ్యమై చేయి కలిపిన చలవే అనుబంధం
చేతిలోన చెయ్యేసి చెప్పేయవా నను ఎన్నడూ విడిపోనని ప్రేమమీద ఒట్టేసి చెప్పేయవా నను వీడని జత నీవన
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి