Bombai Priyudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Bombai Priyudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, నవంబర్ 2021, బుధవారం

Bombay Priyudu : Aho Priya Song Lyrics ( అహో ప్రియా...)

చిత్రం: బొంబాయి ప్రియుడు(1996)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం.ఎం.కీరవాణి


పల్లవి :

అహో ప్రియా.. క్యా బాత్ బోల చిడియా మేరా దిల్ పితర్ పితర్ హోగయా అయ్యయ్యో మిమ్మల్ని కాదండీ నేను నేనేదో సరదాగ రాసుకున్న పాట ప్రాక్టీస్ చేసుకుంటున్నా నంతే అంతే అంతేనండి అహో ప్రియా.. ఇంతకన్న తియ్యనైన పిలుపు వేరె వుందా అహో అహో అహొ ప్రియా అంత మంచి పిలుపు విన్న మనసు ఆగుతుందా కౌగిళించవా ప్రియా అనే జవాబు తానివ్వదా అహో అహో అహొ ప్రియా


చరణం : 1

రాగమంత ఏలుతుందీ అనురాగ మనుపాటకీ తాళమంటు ఏలుతుందీ పెనవేసుకొను ఆటకీ మూగసైగ కన్న మంచి పలుకు ఏముందీ ముద్దు కన్న పెద్దదైన  కవిత ఏముందీ జంటకోరే గుండెలన్నీ ఒక్కటే భాషలో దగ్గరౌతున్నవీ కౌగిళించవా ప్రియా ప్రియా అనేటి భావం అదీ

అహో అహో అహొ ప్రియా ఇంతకన్న తియ్యనైన పిలుపు వేరె వుందా అహో అహో అహొ ప్రియా అంత మంచి పిలుపు విన్న మనసు ఆగుతుందా


చరణం : 2

తీయనైన స్నేహముందీ విరిసేటి పూలతీగలో తీరిపోని దాహముంది తిరిగేటీ తేనే టీగలో పూల బాల పరిమళాల కబురు పంపిందీ తేనే టీగ చిలిపి పాట బదులు పలికింది ఎన్ని సార్లో విన్నదైనా ఎందుకు ఎప్పుడూ కొత్తగా వుంటది కౌగిళించవా ప్రియా ప్రియా అనేటి ఆ సంగతీ

అహో అహో అహొ ప్రియా ఇంతకన్న తియ్యనైన పిలుపు వేరె వుందా అహో అహో అహొ ప్రియా అంత మంచి పిలుపు విన్న మనసు ఆగుతుందా కౌగిళించవా ప్రియా అనే జవాబు తానివ్వదా అహో అహో అహొ ప్రియా

Bombay Priyudu : Pranyama Song Lyrics (ప్రణయమా మరు మల్లె పూల తోటలో ఘుమ ఘుమా)

చిత్రం: బొంబాయి ప్రియుడు(1996)

రచన: చంద్రబోస్

గానం: కె.యస్.చిత్ర, ఎం.ఎం.కీరవాణి

సంగీతం: ఎం.ఎం.కీరవాణి


పల్లవి :

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ప్రణయమా మరు మల్లె పూల తోటలో ఘుమ ఘుమా పరువమా సరసాల వీణ పాటలో సరిగమా మోయలేని భారమా రాయలేని కావ్యమా నండూరి వారి గేయమా ప్రణయమా మరు మల్లె పూల తోటలో ఘుమ ఘుమా పరువమా సరసాల వీణ పాటలో సరిగమా మోయలేని భారమా రాయలేని కావ్యమా నండూరి వారి గేయమా ప్రణయమా మ్మ్ మరు మ్మ్ మల్లె మ్మ్ పూల మ్మ్ తోటలో ఘుమ ఘుమా పరువమా నన సరసాల న వీణ  న పాటలో సరిగమా

చరణం : 1

ఔననకా కాదనకా మనసే వినకా మురిపిస్తా వేల నాయమా న న నా రేయనకా పగలనకా తపనల వెనకా తరిమిస్తావేల న్యాయమా లా ల లా నిన్న లేని చోద్యమా నిన్ను ఆప సాధ్యమా నిన్న లేని చోద్యమా నిన్ను ఆప సాధ్యమా ఆ ఆ గుండె చాటు గానమా గొంతు చాటు మౌనమా ఎదలోని ఇంద్రజాలమా ఆ

ప్రణయమా మరు మల్లె పూల తోటలో ఘుమ ఘుమా పరువమా సరసాల వీణ పాటలో సరిగమా

చరణం : 2


పూలనకా ముళ్ళనకా వలచిన క్షణమే

విహరిస్తావేల హృదయమా రేపనకా మాపనకా ఆ మరు క్షణమే విసిగిస్తావేల విరహమా..లవ్లీ ఇంత వింత సత్యమా ఎంతకైనా సిద్దమా అంతులేని ఆత్రమా అందులోనే అందమా ఆ ఆ కోటి కలల నేత్రమా కొంటె వలపు గోత్రమా శృంగార సుప్రభాతమా ఆ ప్రణయమా మరు మల్లె పూల తోటలో ఘుమ ఘుమా పరువమా సరసాల వీణ పాటలో సరిగమా మోయలేని భారమా రాయలేని కావ్యమా నండూరి వారి గేయమా ప్రణయమా మరు మల్లె పూల తోటలో ఘుమ ఘుమా పరువమా సరసాల వీణ పాటలో సరిగమా

Bombay Priyudu : Balamurali Krishna Song Lyrics (బాలమురళీకృష్ణ మాకు బాల్యమిత్రుడే)

చిత్రం: బొంబాయి ప్రియుడు(1996)

రచన: చంద్రబోస్

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర, ఎం.ఎం.కీరవాణి

సంగీతం: ఎం.ఎం.కీరవాణి



పల్లవి :

ఆ... ఆ... ఆ...

మగ మదనిసా సగమదనిసా ఆ... ఆ... ఓహో... హిందోళం బాగుంది పాడండి పాడండి... బాలమురళీకృష్ణ మాకు బాల్యమిత్రుడే ఆశాభోంస్లే అక్షరాలా అత్తకూతురే గులామలీ అంతటోడు మాకు ఆప్తుడే ఘంటసాల ఉండేవాడు ఇంటి ముందరే స్వచ్ఛమైన సంగీతం ఖచ్చితంగా మా సొంతం రాగజీవులం నాదబ్రహ్మలం స్వరం పదం ఇహం పరం కాగా... ఆ...

చరణం : 1

తేనెపాట పాడితే మేను పులకరించదా వీణపాట పాడితే జాణ పరవశించదా ఈలపాట పాడితే గాలి తాళమేయదా జావళీలు పాడితే జాము తెల్లవారదా భూపాలం పాడితే భూగోళం కూలదా హిందోళం పాడితే ఆందోళన కలగదా ఒహొహొ హొహొహో ఓ... ఓ... కళ్యాణిలా పాడితే కళ్యాణం జరగదా శ్రీరాగం పాడితే సీమంతం తప్పదా గులకరాళ్లకేమి తెలుసు చిలక పలుకులు ఈ గార్దభాలకేమి తెలుసు గాంధర్వ గానాలు... ఆ...

చరణం : 2

ఆ... ఆ... ఆ... ఆ... ఆ... సామగదామగ సామగదామగ షడ్జమంలో పాడితే లోకమంతా ఊగదా మధ్యమంలో పాడితే మత్తులోన మునగదా గొంతువిప్పి పాడితే మంత్రముగ్ధులవ్వరా శ్రోతలంతా బుద్ధిగా వంతపాడకుందురా ఎలుగెత్తి పాడగా ఆకాశం అందదా శ్రుతి పెంచి పాడగా పాతాళం పొంగదా ఒహొహొ హొహొహో ఓ... ఓ... అలవోకగా పాడగా హరివిల్లే విరియదా ఇల గొంతుతో పాడగా చిరుజల్లే కురవదా తేటతెలుగు పాటలమ్మ తోటపువ్వులం మేము సందేహమంటూ లేని సంగీత సోదరులం ఆ... సనిస దానీసా గసనిద మగసా తారినన్న తారినన్న తారినన్నన నీ పప్పులుడకవోయ్

నీకు ముప్పు తప్పదోయ్ నీ పప్పులుడకవోయ్ నీకు ముప్పు తప్పదోయ్ 

నినిస గాస నిసగా సనిదమసా తారినన్న తారినన్న తారినన్నన నీకు ముప్పు తప్పదోయ్ నీ పప్పులుడకవోయ్ నీకు ముప్పు తప్పదోయ్ ససస ససగ సస సాగ ససగ ససాగ సనిద మగస గమదా మదనీ దని సాగస నీసని దానిద మగసా నీసని దనిసా దస నిదనీ మగ గస సని నిద దమ మగ గస గమ దమగా నిదమా సనిదమగా సగాగ సమామ గామగ సగమద మగ సమామ గదాద మగమదనీ ససగసా దాని ససమగా సనిస గగగ ససస నినిని దదద గగసని మమమ గగగ ససస నినిని మగసని సమా సగా నిస దనిస గామగసా సగా నిసా దనిమదనీ సాగసనీ సామగ సామగ సామగ సామగ సాగస నీసని దనిసా సాగస నీసని దానిద మాదమ గమదని సగగా... మాగమా గసగా గా సని దనిసా సమగస నిగసని దసనిద మగసని సాగమదామగ సాగమదామగ (2) దా మద నీదమ దా మద నీదమ మాదని సానిద మాదని సానిద సాగసనీసని సాగసనీసని (2) సమా... గా సా నీ దా నీ సా...

20, జూన్ 2021, ఆదివారం

Bombay Priyudu : Chethilona Song Lyrics ( చేతిలోన చెయ్యేసి చెప్పేయవా)

 

చిత్రం : బొంబాయి ప్రియుడు(1996)

సంగీతం: M.M.కీరవాణి

సాహిత్యం: వేటూరి

గానం: బాలసుబ్రహ్మణ్యం, ప్రతిమ రావు



పల్లవి :  చేతిలోన చెయ్యేసి చెప్పేయవా నను ఎన్నడూ విడిపోనని  ప్రేమమీద ఒట్టేసి చెప్పేయవా నను వీడని జత నీవని  చేతిలోన చెయ్యేసి చెప్పేయవా నను ఎన్నడూ విడిపోనని  ప్రేమమీద ఒట్టేసి చెప్పేయవా నను వీడని జత నీవని  ప్రతిక్షణం ప్రేమలో పరీక్షలే వచ్చినా  తలరాతకు తలవంచదు ప్రేమ... ఆ...   చేతిలోన చెయ్యేసి చెప్పేయవా నను ఎన్నడూ విడిపోనని    చరణం : 1  నీవు నేనులే మనస్సు ఒక్కటే  ఇద్దరైన ఈ మమకారంలో  నీవు నేననే పదాలు లేవులే  ఏకమైన ఈ ప్రియమంత్రంలో  నా గుండెలో కోకిల నీ గొంతులో పాడగా  నా జన్మ ఓ పూవులా నీ కొమ్మలో పూయగా  కల ఇలా కౌగిలై తనే కలే వెన్నెలై  చేయి కలిపిన చెలిమే అనురాగం... ఆ...  "చేతిలోన"  చరణం : 2  నిన్నుతాకితే దేవతార్చన పూజలందుకో పులకింతల్లో  వాలు చూపులే వరాల దీవెన నన్ను దాచుకో కనుపాపల్లో  నా ప్రేమ గీతానికి నీవేలే తొలి అక్షరం  నా ప్రేమ పుట్టింటికి నీవేలే దీపాంకురం  రసానికో రాగమై రచించని కావ్యమై  చేయి కలిపిన చలవే అనుబంధం
 చేతిలోన చెయ్యేసి చెప్పేయవా నను ఎన్నడూ విడిపోనని  ప్రేమమీద ఒట్టేసి చెప్పేయవా నను వీడని జత నీవన