చిత్రం: బ్రహ్మ (1992)
రచన: గురుచరణ్
గానం: జేసుదాస్ , కె.యస్.చిత్ర
సంగీతం: బప్పీలహరి
జుమ్మాజుమ్మా కొమ్మా రెమ్మల్లో తుమ్మెదాడేనోయమ్మలో
గుచ్చి గుచ్చి కన్నే గుండెల్లో.. గుమ్మెత్తించేనోయమ్మలో
జుంటి తేనేకై చంటి పువ్వుతో సరసమాడుతుంటే
హో సోకులాడె ఆ రేకులిప్పుకొని తుళ్ళీపడుతుంటే
జుమ్మాజుమ్మా కొమ్మా రెమ్మల్లో తుమ్మెదాడేనోయమ్మలో
గుచ్చి గుచ్చి కన్నే గుండెల్లో.. గుమ్మెత్తించేనోయమ్మలో
చిలిపి కోరికే వలపు కిన్నెరై కులుకులాడుతుంటే హోయ్ కలికి గుండెలో వణుకు సూదులై ఒల్లే తుళ్ళీ ఆడే...
జుమ్మాజుమ్మా కొమ్మా రెమ్మల్లో,తుమ్మెదాడేనోయమ్మలో
రాగాలమ్మ పాట మేఘాలమ్మతోటి రాయభారమే పంపగా
ఆ రాగారాలా రేయి ఊగాడే వయ్యారం జతగాడే శృతి చేయగా
సందెరంగుల సన్నగాజులే చిందులాడుకోగా
కందిపోయిన కన్నెబుగ్గలే సింగారాలు ఆడ
జుమ్మాజుమ్మా కొమ్మా రెమ్మల్లో తుమ్మెదాడేనోయమ్మలో
గుచ్చి గుచ్చి కన్నే గుండెల్లో.. గుమ్మెత్తించేనోయమ్మలో
నింగి నీలవేణి కొంగు చాటులోని రంగు బొంగరాలాడగా
ఆ దాగుడు మూతల్లోన దాచిన అందాలన్నీ రాగలవాడికి అందించగా
ఆ దొంతుమల్లెలా బంతులాటతో రేయి గడిచిపోగా
గంతులాడు కౌగిళ్ళ వేడిలో ఒల్లే తుళ్ళి పాడ
జుమ్మాజుమ్మా కొమ్మా రెమ్మల్లో తుమ్మెదాడేనోయమ్మలో
గుచ్చి గుచ్చి కన్నే గుండెల్లో..గుమ్మెత్తించేనోయమ్మలో
చిలిపి కోరికే వలపు కిన్నెరై కులుకులాడుతుంటే హోయ్ కలికి గుండెలో ములుకు సూదులై ఒల్లే తుళ్ళీ ఆడే
జుమ్మాజుమ్మా కొమ్మా రెమ్మల్లో తుమ్మెదాడేనోయమ్మలో
గుచ్చి గుచ్చి కన్నే గుండెల్లో..గుమ్మెత్తించేనోయమ్మలో
జుంటి తేనేకై చంటి పువ్వుతో సరసమాడుతుంటే
హో సోకులాడె ఆ రేకులిప్పుకొని తుళ్ళేపడుతుంటే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి