చిత్రం: ప్రెసిడెంట్ గారి పెళ్ళాం (1992)
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ
ఓసి కందిరీగ వేసుకోవె పాగ నువ్వు చందమామ నాది సందె ప్రేమ కాటు వేయకమ్మా కందుతుంది బొమ్మా తెల్లచీరలో అందమే చూసే నల్ల చీకటే నాకు ఆశా అడ్డు చెప్పినా ఆగడే బావా తెడ్డుకోరెనె పూల నావా సొగసే విరబోసుకున్న నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ ఓసి కందిరీగ వేసుకోవె పాగ నువ్వు చందమామ నాది సందె ప్రేమ కాటు వేయకమ్మా కందుతుంది బొమ్మా పెదాలకు చేరెను పెళ్ళికి చెందిన సందడి నీ ముద్దులాగ వయస్సున కూసె వసంతం లాడిన కోరిక సన్నయిలాగ రుచించిన చెక్కిల్లలో రచించిన చేరాతలే వరించిన వారాలలో స్మురించెను శుభలేఖలై మనసే మనువాడుకున్ననువ్వు మల్లెతీగ నేను తేనెటీగ
ఓసి కందిరీగ వేసుకోవె పాగ
నువ్వు చందమామ నాది సందె ప్రేమ
కాటు వేయకమ్మ కందుతుంది బొమ్మా
ముఖాలకు వేసిన ముచ్చిక సిగ్గుల లేఖలు రా రమ్మనేగా
సుఖాలుగ మారెను ఇద్దరి వత్తిడి ప్రేమలు ఈ మధ్యనేగా
కథే ఇక మారిందిలే గతే ఒక్కటవుతుందిలే
కలేసిన కాలాలలో కలే నిజమయ్యిందిలే
తొడిమే తడి చేసుకున్న
నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ
ఓసి కందిరీగ వేసుకోవె పాగ
నువ్వు చందమామ నాది సందె ప్రేమ
కాటు వేయకమ్మ కందుతుంది బొమ్మా
తెల్లచీరలో అందమే చూసే నల్ల చీకటే నాకు ఆశా
అడ్డు చెప్పినా ఆగడే బావా తెడ్డుకోరెనె పూల నావా
సొగసే విరబోసుకున్న నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ
ఓసి కందిరీగ వేసుకోవె పాగ
నువ్వు చందమామ నాది సందె ప్రేమ
కాటు వేయకమ్మా కందుతుంది బొమ్మా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి