చిత్రం : చంటి (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: బాలసుబ్రహ్మణ్యం,చిత్ర
ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు వేసే పూల బాణం కూసే గాలి గంధం పొద్దేలేని ఆకాశం హద్దేలేని ఆనందం ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు సిరిగల చిలకలు ఇలదిగి నడచుట న్యాయమా ధర్మమా తొలకరి మెరుపులు చిలికిన చినుకులు నింగిలో ఆగునా చలిమర గదులలో సుఖపడు బతుకులు వేసవే కోరునా అలికున గుడిసెల చలువుల మనసులు మేడలో దొరుకునా అందాల మేడల్లోనే అంటదు కాలికి మన్ను బంగారు పంటలు పండే మన్నుకు చాలదు మిన్ను నిరుపేదిల్లు పొదరిల్లు ఇలలో ఉన్న హరివిల్లు ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు వేసే పూల బాణం కూసే గాలి గంధం పొద్దేలేని ఆకాశం హద్దేలేని ఆనందం ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు జలజల పదముల అలజడి నదులకు వంత నే పాడనా మిలమిల మెరిసిన తళతళ తారలు నింగినే వీడునా చెరువుల కడుపున విరిసిన తామర తేనెలే పూయునా మిణుగురు పురుగుల మిడిమిడి వెలుగులు వెన్నెలై కాయునా ఏ గాలి మేడల్లోనో దీపంలా నే ఉన్నా మా పల్లె సింగారాలు నీలో నేనే కన్నా గోదారమ్మ పరవళ్ళు తెలుగింటమ్మ తిరునాళ్ళు ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు వేసే పూల బాణం కూసే గాలి గంధం పొద్దేలేని ఆకాశం హద్దేలేని ఆనందం ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలుchanchan
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి