Chanti లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Chanti లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, జనవరి 2022, గురువారం

Chanti : Pavuraniki Panjaraniki Song Lyrics (పావురానికి పంజరానికి)

చిత్రం: చంటి (1992)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: ఇళయరాజా



పావురానికి పంజరానికి పెళ్ళీ చేసె పాడులోకం కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూడలోకం (2) కోడిగట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా పావురానికి పంజరానికి పెళ్ళీ చేసె పాడులోకం కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూడలోకం తానిచ్చు పాలలో ప్రేమంత కలిపి సాకింది నా కన్న తల్లీ లాలించు పాటలో నీతంత తెలిపి పెంచింది నాలోన మంచి కపటాలు మోసాలు నాలోన లేవు కలనైన అపకారి కాను చేసిన పాపములా ఇది ఆ విధి శాపములా మారని జాతకమా ఇది దేవుని శాసనమా ఇది తీరేదే కాదా... పావురానికి పంజరానికి పెళ్ళీ చేసె పాడులోకం (||) తాళంటె తాడనే తలచాను నాడు అది ఏదో తెలిసేను నేడు ఆ తాళి పెళ్ళికే రుజువన్న నిజము తరువాత తెలిసేమి ఫలము ఏమైన ఏదైన జరిగింది ఘోరం నా మీద నాకేలె కోపం నా తొలి నేరమున ఇది తీరని వేదననా నా మది లోపములా ఇవి ఆరని శోకములా ఇక ఈ బాధే పోదా... కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూడలోకం (2) కోడిగట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా పావురానికి పంజరానికి పెళ్ళీ చేసె పాడులోకం కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూడలోకం

5, ఆగస్టు 2021, గురువారం

Chanti : Oh Prema Song Lyrics (ఓ ప్రేమా నా ప్రేమా)

చిత్రం : చంటి (1992)

సంగీతం: ఇళయరాజా

సాహిత్యం: వేటూరి

గానం: బాలసుబ్రహ్మణ్యం,చిత్ర



ఓ ప్రేమా నా ప్రేమా దైవాలాడే జూదం దయ్యంపాడే వేదం ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా దైవాలాడే జూదం దయ్యంపాడే వేదం రక్తంలోని సుడిగుండం రాయైపోయే అనుబందం ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా క్షణమొక యుగముగా గడిపిన బ్రతుకిది తెలుసుకో ప్రియతమా విరహమే సుఖమని కలయిక కలయని తలచుటే మధురమా మృతులకు చితులకు ముగియని కధలివి కదలిరా ప్రణయమా అడుగులు చిలికిన రుధిరవు మడుగుల ఎరుపులే ప్రళయమా జారిపోయే కాలం చేజారిపోయే యోగం రగులుతున్న గాయం నేనడగలేను న్యాయం కరువౌతాను కన్నుల్లో గురుతుంటాను గుండెల్లో ఓ ప్రేమా నా ప్రేమా దైవాలాడే జూదం దయ్యంపాడే వేదం రక్తంలోని సుడిగుండం రాయైపోయే అనుబందం ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా గిరిలను విడిచిన నదులిక వెనుకకు తిరుగునా జగమున కులమని కడుదని కులమని విలువలు చెరుగునా మనసున గగనము మెరుపుల నగలను తొడిగితే ఘనతలే పెరుగునా ఉరుములు వినపడి ఉదయపు వెలుగులు అదురునా చెదురునా పేదవాళ్ళ ప్రేమ కాటువేసే పామా స్వాగతాలు అనగా చావుకైనా ప్రేమ మానై నేను బ్రతికున్నా మనిషై నేను చస్తున్నా ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా దైవాలాడే జూదం దయ్యంపాడే వేదం రక్తంలోని సుడిగుండం రాయైపోయే అనుబందం ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా

1, ఆగస్టు 2021, ఆదివారం

Chanti : Jabiliki Vennelaki Song Lyrics ( జాబిలికీ వెన్నెలకీ )

చిత్రం : చంటి (1992)

సంగీతం: ఇళయరాజా

సాహిత్యం: సాహితి

గానం: బాలసుబ్రహ్మణ్యం



జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే ముద్దులోనే పొద్దుపోయే కంటి నిండా నిద్దరోవే చంటి పాడే జోలలోనే జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే వేమనయ్య నా గురువే వేలిముద్ర నా చదువే పాలబువ్వ నా పలుకే హాయి నిద్ర పాపలకే వేమనయ్య నా గురువే వేలిముద్ర నా చదువే పాలబువ్వ నా పలుకే హాయి నిద్ర పాపలకే కూనలమ్మ నా పదమే తేనెకన్నా తియ్యనిదే కోనలన్నీ పాడుకునే గువ్వ చిన్న పాట ఇదే రాగముల తాళములు నాకసలే రావులే పాడుకొను జ్ఞానమునే నా కొసగే దైవమే ముద్దులోనే పొద్దుపోయే కంటి నిండా నిద్దరోవే చంటి పాడే జోలలోనే జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే

26, జూన్ 2021, శనివారం

Chanti : Annula Minnula Song Lyrics (అన్నుల మిన్నల)

చిత్రం : చంటి (1992)

సంగీతం: ఇళయరాజా

సాహిత్యం: సాహితి

గానం: బాలసుబ్రహ్మణ్యం



పల్లవి: అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే సుమ సుందరి అందెలలో చిరుమువ్వల సందడులే శుభమంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే అలివేణే ఈ రాణీ... అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే చరణం 1: ఆ దేవుడు ఆ దేవితో అలక బూనెనేమో ఈ రూపుగ శ్రీదేవిని ఇలకు పంపెనేమో మోహనాల సోయగాల మేనకో మరి దేవలోక పారిజాత మాలికో రేకులు విచ్చిన సిరిమల్లి అన్నల ముద్దుల చెల్లి నేలకు వచ్చిన జాబిల్లి వన్నెల రంగులవల్లి విరబూసే పూబోనీ... అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే సుమ సుందరి అందెలలో చిరుమువ్వల సందడులే శుభమంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే అలివేణే ఈ రాణీ...
అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే చరణం 2: ఆ కలువలు ఈ కనులకు మారు రూపులేమో ఆ నగవలు వేకువలకు మేలుకొలుపులేమో పాల కడలి మీద తేలు చంద్రికో.. గగనాల వేళ కాంతులీను తారకో వెన్నల్లె వస్తాడు ఓనాడు రాజుంటి గొప్పింటి మొగుడు ఊరంత సందెల్లు ఆనాడు వాడంతా వియ్యాలవారు పిప్పి పీ..పీ..డుం..డుం..డుం..... అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే సుమ సుందరి అందెలలో చిరుమువ్వల సందడులే శుభమంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే అలివేణే ఈ రాణీ... అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే


Chanti : Ennenno Andalu song Lyrics (ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు)

చిత్రం : చంటి (1992)

సంగీతం: ఇళయరాజా

సాహిత్యం: వేటూరి

గానం: బాలసుబ్రహ్మణ్యం,చిత్ర


ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు వేసే పూల బాణం కూసే గాలి గంధం పొద్దేలేని ఆకాశం హద్దేలేని ఆనందం ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు సిరిగల చిలకలు ఇలదిగి నడచుట న్యాయమా ధర్మమా తొలకరి మెరుపులు చిలికిన చినుకులు నింగిలో ఆగునా చలిమర గదులలో సుఖపడు బతుకులు వేసవే కోరునా అలికున గుడిసెల చలువుల మనసులు మేడలో దొరుకునా అందాల మేడల్లోనే అంటదు కాలికి మన్ను బంగారు పంటలు పండే మన్నుకు చాలదు మిన్ను నిరుపేదిల్లు పొదరిల్లు ఇలలో ఉన్న హరివిల్లు ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు వేసే పూల బాణం కూసే గాలి గంధం పొద్దేలేని ఆకాశం హద్దేలేని ఆనందం ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు జలజల పదముల అలజడి నదులకు వంత నే పాడనా మిలమిల మెరిసిన తళతళ తారలు నింగినే వీడునా చెరువుల కడుపున విరిసిన తామర తేనెలే పూయునా మిణుగురు పురుగుల మిడిమిడి వెలుగులు వెన్నెలై కాయునా ఏ గాలి మేడల్లోనో దీపంలా నే ఉన్నా మా పల్లె సింగారాలు నీలో నేనే కన్నా గోదారమ్మ పరవళ్ళు తెలుగింటమ్మ తిరునాళ్ళు ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు వేసే పూల బాణం కూసే గాలి గంధం పొద్దేలేని ఆకాశం హద్దేలేని ఆనందం ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలుchanchan