చిత్రం : కూలీ నెంబర్ 1 (1991)
సంగీతం : ఇళయ రాజా
గీతరచయిత : సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం : ఇళయ రాజా, పి. సుశీల
పల్లవి :
కలయా నిజమా తొలిరేయి హాయి మహిమ కలయా నిజమా తొలిరేయి హాయి మహిమ అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా అణిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా ॥ చరణం : 1
లేనిపోని ఏ కూనిరాగమో లేచి రా అంటున్నదీ ఊరుకోని ఏ వెర్రి కోరికే తీర్చవా అంటున్నదీ కోకముళ్ల కూపీ తీసే కైపు చూపు కొరుకున్నదీ కుర్రకళ్లు చీరగళ్లలో దారే లేక తిరుగుతున్నవి ముంచే మైకమే మురిపించే మొహమో ॥ చరణం : 2
చేయి వేయనా సేవ చెయ్యనా ఓయ్ అనే వయ్యారమా పాలముంచిన నీటముంచిన నీ దయే శృంగారమా ఆగలేని ఆకలేవిటో పైకి పైకి దూకుతున్నవి కాలు నేల నిలవకున్నది ఆకాశాన తేలుతున్నది అంతా మాయగా అనిపించే కాలము
అద్భుత శృంగార సాహిత్యం.వేటూరికి దీటుగా ఉంది.
రిప్లయితొలగించండి