12, జూన్ 2021, శనివారం

Coolie No 1 : Kila Kilamani song lyrics ( కిల కిల మని కళావరు రాణి)

చిత్రం : కూలీ నెంబర్ 1 (1991)

సంగీతం : ఇళయ రాజా

గీతరచయిత : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర



పల్లవి: కిల కిల మని కళావరు రాణి ఘల్లు ఘల్లు మని కథాకళి కాని కళ్ళెం లేని కళ్ళలోని కవ్వింతల్ని హలో అని ఛల్ మోహనాంగా సుఖాలకు బోణి చలి గిలి అన్ని పొలోమని పోని సిగ్గేలేని సింగారాని చిందించని చలో హని మదనుడి పాలైపోని ముదిరిన భావాలన్ని మగ జత పాడే బాణి మగువకు రేవై రాణి కిల కిల మని కళావరు రాణి ఘల్లు ఘల్లు మని కథాకళి కాని కళ్ళెం లేని కళ్ళలోని కవ్వింతల్ని హలో అని చరణం 1: బరువుగా.. విరివిగా.. ఆపె చూపు కథ ఏపుగా.. గోపిక చొరవగా.. కరువుగా.. కాపు వేసె కథ కైపుగా.. కోరిక వాలే పరువాలే తగువేలే గనుకా కాలే తమకాలే గమకాలే పలుకా కాంక్షలో శ్రుతీ గతి పెంచీ కాల్చదా చుట్టు కట్టే కంచే.. ఈ మైకం ఈడులో అతి గతి లేని వేడికో దిక్కు మొక్కు పంచి.. ఈ రాగం ఆదమరిచిన ఈడులో ఈతలాడని ఛల్ మొహనాంగా సుఖాలకు బోణి చలి గిలి అన్ని పొలోమని పోని సిగ్గేలేని సింగారాని చిందించని చలో హని చరణం 2: ఒడుపుగా.. ఒలుచుకో.. ఓపలేను కదా ఒంటిలో.. అవసరం చిలిపిగా.. దులుపుకో.. మోయలేవు కదా నడుములో.. కలవరం తాపం తెరతీసి తరిమేసే తరుణం తాళం తలుపేసి విరబూసే సమయం వీలుగా గుట్టు మట్టు మీటి విలుగా ఇట్టె పుట్టే వేడి ఏడెడో ఒంటిగ ఉంటే ఒట్టే అంటు వెంటనే జట్టే కట్టెయాలి ఏనీడో జోడు బిగిసిన వేడిలో వేగిపోని కిల కిల మని కళావరు రాణి ఘల్లు ఘల్లు మని కథాకళి కాని కళ్ళెం లేని కళ్ళలోని కవ్వింతల్ని హలో అని ఛల్ మొహనాంగా సుఖాలకు బోణి చలి గిలి అన్ని పొలోమని పోని సిగ్గేలేని సింగారాని చిందించని చలో హని మదనుడి పాలైపోని ముదిరిన భావాలన్ని మగ జత పాడే బాణి మగువకు రేవై రాణి కిల కిల మని కళావరు రాణి ఛల్ మొహనాంగా సుఖాలకు బోణి కళ్ళెం లేని కళ్ళల్లోని కవ్వింతల్ని హలో అని




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి