Coolie No 1 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Coolie No 1 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, మార్చి 2024, శుక్రవారం

Coolie No 1 : Attention Everybody Song Lyrics (ఆటెన్షన్ ఎవ్రిబడి )

చిత్రం : కూలీ నెంబర్ 1 (1991)

సంగీతం : ఇళయ రాజా

గీతరచయిత : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం



పల్లవి :

ఆటెన్షన్ ఎవ్రిబడి నేనొస్తున్నా బీ రెడీ నేనే మహారాజు నా చుట్టు క్యూ కట్టండి చెయ్యెత్తి జే కొట్టండి నాదే ప్రతి రోజు అదృష్టం బాడీగార్డు అన్నింటా నేనే ఫస్ట్ కాలాన్ని కట్టికూర్చోబెట్టా గుమ్మం ముందు ఆటెన్షన్ ఎవ్రిబడి నేనొస్తున్నా బీ రెడీ నేనే మహారాజుహ హ నా చుట్టు క్యూ కట్టండి చెయ్యెత్తి జే కొట్టండి నాదే ప్రతి రోజు

చరణం : 1

హోలీడేకి జోలిగా హాలీవుడ్డేళ్లానంటే హాల్లో బాసు హౌ డు యు డు అంటూ డైలీ ఎంతో మంది హీరో రోల్ ఇస్తామంటూ ప్రాణం తింటూ ఉంటారు సారి రా డైరీ కాళిలేదంటే వింటారా హ హ హ ఐ యామ్ ఏ బాటసారి మేఘాల రహదారి ఉండుండి నేల జారి హాల్టేస్తా ఒక్కసారి ఫోలెండ్లో పొద్దున్నుండి హాలెండులోన ఆఫ్టర్ నూన్ సిడ్నీ లో సాయంకాలం వాషింగ్టన్లో నైటుంటాను ఎపుడు నివాసం ఏరో ప్లైన్ ఎక్కడా స్టడిగా కూర్చోలేను సూరీడల్లే భూగోళాన్ని చుట్టేస్తూనే ఉంటా ఎవ్రిడే ఆటెన్షన్ ఎవ్రిబడి నేనొస్తున్నా బీ రెడీ నేనే మహారాజు హ హ నా చుట్టు క్యూ కట్టండి చెయ్యెత్తి జే కొట్టండి నాదే ప్రతి రోజు అదృష్టం బాడీగార్డు అన్నింటా నేనే ఫస్ట్ కాలాన్ని కట్టికూర్చోబెట్టా గుమ్మం ముందు హ హ హహ ఆటెన్షన్ ఎవ్రిబడి నేనొస్తున్నా బీ రెడీ నేనే మహారాజు నా చుట్టు క్యూ కట్టండి చెయ్యెత్తి జే కొట్టండి నాదే ప్రతి రోజు

చరణం : 2

నేనేడుంటే ఆడే చుట్టూ ఆడోళ్లంతా అల్లేస్తారు హాల్లో డార్లింగ్ అంటూ నాతో డేటింగ్ ఔటింగ్ మీటింగ్ మేటింగ్ ఏదైనా ఓకే అంటారు పెళ్ళాడందే పోదీమేళం ఇల్లా అయితే పోదా శీలం ఐ యామ్ ఎ బ్రహ్మచారి పట్టాను పెళ్లిదారి కావాలి తగనారి నువ్వేనా ఆ చిన్నారి నచ్చాలి కన్ను ముక్కు నిక్కు టెక్కు ఉన్న బాడీ నచ్చాలి నాలో ఉన్న వాడి వేడి కన్నెలేడి మగువా మగాడ అనిపించాలి పొగరు వగైరా కనిపించాలి ఓకే అయితే చేపడతాను చూపెడతాను జతలో హనీమూను ఆటెన్షన్ ఎవ్రిబడి నేనొస్తున్నా బీ రెడీ నేనే మహారాజు నా చుట్టు క్యూ కట్టండి చెయ్యెత్తి జే కొట్టండి నాదే ప్రతి రోజు అదృష్టం బాడీగార్డు అన్నింటా నేనే ఫస్ట్ కాలాన్ని కట్టికూర్చోబెట్టా గుమ్మం ముందు ఆటెన్షన్ ఎవ్రిబడి నేనొస్తున్నా బీ రెడీ నేనే మహారాజు నా చుట్టు క్యూ కట్టండి చెయ్యెత్తి జే కొట్టండి నాదే ప్రతి రోజు

17, జూన్ 2021, గురువారం

Coolie No 1 : Kotta Kottaga Unnadi Song Lyrics (కొత్త కొత్తగా వున్నది)

చిత్రం : కూలీ నెంబర్ 1 (1991)

సంగీతం : ఇళయ రాజా

గీతరచయిత : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర




పల్లవి :

కొత్త కొత్తగా వున్నది స్వర్గమిక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులై(2) నేల చేరగానే కొత్త కొత్తగా వున్నది స్వర్గమిక్కడే అన్నది

చరణం : 1

నా కన్ను ముద్దాడితే కన్నె కులుకాయే కనకాంబరం నా చెంప సంపెంగలో కెంపు రంగాయే తొలి సంబరం ఎన్ని పొంగులో కుమారి కొంగులో ఎన్ని రంగులో సుమాల వాగులో (ఎన్ని) ఉద్యోగామిప్పించవా షోకు ఉద్యాన వనమాలిగా జీతమియ్యగా లేత వన్నెలే చెల్లించుకోనా

చరణం : 2

నీ నవ్వు ముద్దాడితే మల్లెపువ్వాయే నా యవ్వనం నాజూకు మందారమే ముళ్ళ రోజాగా మారే క్షణం మొగలి పరిమళం మగాడి కౌగిలి మగువ పరవశం సుఖాల లోగిలి(మొగలి) కండల్లో వైశాఖమా కైపు ఎండల్లో కరిగించుమా తీగ మల్లికి నరాల పందిరి అందించుకోనా 





12, జూన్ 2021, శనివారం

Coolie No 1 : Kalaya Nijama Song Lyrics (కలయా నిజమా తొలిరేయి హాయి మహిమ)

చిత్రం : కూలీ నెంబర్ 1 (1991)

సంగీతం : ఇళయ రాజా

గీతరచయిత : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : ఇళయ రాజా, పి. సుశీల



పల్లవి :

కలయా నిజమా తొలిరేయి హాయి మహిమ కలయా నిజమా తొలిరేయి హాయి మహిమ అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా అణిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా ॥ చరణం : 1

లేనిపోని ఏ కూనిరాగమో లేచి రా అంటున్నదీ ఊరుకోని ఏ వెర్రి కోరికే తీర్చవా అంటున్నదీ కోకముళ్ల కూపీ తీసే కైపు చూపు కొరుకున్నదీ కుర్రకళ్లు చీరగళ్లలో దారే లేక తిరుగుతున్నవి ముంచే మైకమే మురిపించే మొహమో ॥ చరణం : 2

చేయి వేయనా సేవ చెయ్యనా ఓయ్ అనే వయ్యారమా పాలముంచిన నీటముంచిన నీ దయే శృంగారమా ఆగలేని ఆకలేవిటో పైకి పైకి దూకుతున్నవి కాలు నేల నిలవకున్నది ఆకాశాన తేలుతున్నది అంతా మాయగా అనిపించే కాలము


Coolie No 1 : Kila Kilamani song lyrics ( కిల కిల మని కళావరు రాణి)

చిత్రం : కూలీ నెంబర్ 1 (1991)

సంగీతం : ఇళయ రాజా

గీతరచయిత : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర



పల్లవి: కిల కిల మని కళావరు రాణి ఘల్లు ఘల్లు మని కథాకళి కాని కళ్ళెం లేని కళ్ళలోని కవ్వింతల్ని హలో అని ఛల్ మోహనాంగా సుఖాలకు బోణి చలి గిలి అన్ని పొలోమని పోని సిగ్గేలేని సింగారాని చిందించని చలో హని మదనుడి పాలైపోని ముదిరిన భావాలన్ని మగ జత పాడే బాణి మగువకు రేవై రాణి కిల కిల మని కళావరు రాణి ఘల్లు ఘల్లు మని కథాకళి కాని కళ్ళెం లేని కళ్ళలోని కవ్వింతల్ని హలో అని చరణం 1: బరువుగా.. విరివిగా.. ఆపె చూపు కథ ఏపుగా.. గోపిక చొరవగా.. కరువుగా.. కాపు వేసె కథ కైపుగా.. కోరిక వాలే పరువాలే తగువేలే గనుకా కాలే తమకాలే గమకాలే పలుకా కాంక్షలో శ్రుతీ గతి పెంచీ కాల్చదా చుట్టు కట్టే కంచే.. ఈ మైకం ఈడులో అతి గతి లేని వేడికో దిక్కు మొక్కు పంచి.. ఈ రాగం ఆదమరిచిన ఈడులో ఈతలాడని ఛల్ మొహనాంగా సుఖాలకు బోణి చలి గిలి అన్ని పొలోమని పోని సిగ్గేలేని సింగారాని చిందించని చలో హని చరణం 2: ఒడుపుగా.. ఒలుచుకో.. ఓపలేను కదా ఒంటిలో.. అవసరం చిలిపిగా.. దులుపుకో.. మోయలేవు కదా నడుములో.. కలవరం తాపం తెరతీసి తరిమేసే తరుణం తాళం తలుపేసి విరబూసే సమయం వీలుగా గుట్టు మట్టు మీటి విలుగా ఇట్టె పుట్టే వేడి ఏడెడో ఒంటిగ ఉంటే ఒట్టే అంటు వెంటనే జట్టే కట్టెయాలి ఏనీడో జోడు బిగిసిన వేడిలో వేగిపోని కిల కిల మని కళావరు రాణి ఘల్లు ఘల్లు మని కథాకళి కాని కళ్ళెం లేని కళ్ళలోని కవ్వింతల్ని హలో అని ఛల్ మొహనాంగా సుఖాలకు బోణి చలి గిలి అన్ని పొలోమని పోని సిగ్గేలేని సింగారాని చిందించని చలో హని మదనుడి పాలైపోని ముదిరిన భావాలన్ని మగ జత పాడే బాణి మగువకు రేవై రాణి కిల కిల మని కళావరు రాణి ఛల్ మొహనాంగా సుఖాలకు బోణి కళ్ళెం లేని కళ్ళల్లోని కవ్వింతల్ని హలో అని




7, జూన్ 2021, సోమవారం

Coolie No1 : Dandalayya Undralayya Song Lyrics (దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా)

చిత్రం : కూలీ నెంబర్ 1 (1991)

సంగీతం : ఇళయ రాజా

గీతరచయిత : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం



పల్లవి :

జై జై జై జై గణేశ జై జై జై జై జై జై జై జై వినాయక జై జై జై జైజై జై జై జై గణేశ జై జై జై జై జై జై జై జై వినాయక జై జై జై జై

దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా తండ్రి వలే ఆదరించి తోడు నీడ అందించయ్యా ఓ. దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ

చరణం : 1

చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదరా పాపం కొండంత నీ పెనుభారం ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా ఓ. హో హో జన్మ ధన్యం చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదరా పాపం కొండంత నీ పెనుభారం ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా ఓ. హో హో జన్మ ధన్యం అంబారిగా ఉండగల ఇంతటి వరం అంబాసుతా ఎందరికి లబించురా ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ

చరణం : 2

శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళాకోళం ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళాకోళం ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం త్రిమూర్తులే నిను గని తలొంచరా నిరంతరం మహిమను కీర్తించరా నువ్వెంత అనే అహం నువ్వే దండించరా

దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ అరె రె రె. పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా తండ్రి వలే ఆదరించి తోడు నీడ అందించయ్యా ఓ.

దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ జై జై జై జై (దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ)