28, జూన్ 2021, సోమవారం

Devullu : Nee Prema Kore Song Lyrics (మీ ప్రేమ కోరే చిన్నారులం)

చిత్రం: దేవుళ్ళు (2000)

రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు

గానం: స్వర్ణలత, కె.యస్.చిత్ర

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్



మీ ప్రేమ కోరే చిన్నారులం మీ ఒడిన ఆడే చందమామలం మీ ప్రేమ కోరే చిన్నారులం మీ ఒడిన ఆడే చందమామలం గోరుముద్దలెరుగని బాలకృష్ణులం భాద పైకి చెప్పలేని బాల ఏసులం ఆలోచించండి ఓ అమ్మానాన్నా ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా మీ ప్రేమ కోరే చిన్నారులం మీ ఒడిన ఆడే చందమామలం కమ్మగా మా అమ్మచేతితో ఏ పూట తింటాము ఏడాదిలో చక్కగా మా నాన్న పక్కగా సరదాగా తిరిగేది ఏ నాటికో పొద్దున్నే పరుగున వెడతారు రాతిరికి ఎపుడో వస్తారు మరి మరి అడిగినా కథలు చెప్పరు మేమేం చెప్పినా మనసుపెట్టరు అమ్మ నాన్న తీరు మాకు అర్థమవ్వదు ఏమి చేయాలో మాకు దిక్కుతోచదు ఆలోచించండి ఓ అమ్మానాన్నా ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా మీ ప్రేమ కోరే చిన్నారులం మీ ఒడిన ఆడే చందమామలం పిల్లలం మీ చేతి ప్రమిదలం మీ ప్రేమ చమురుతో వెలుగు దివ్వెలం పువ్వులం మీ ఇంటి నవ్వులం మీ గుండెపై ఆడు చిన్ని గువ్వలం కనిపించే మీరే దేవుళ్ళు కనిపించే శివుడు పార్వతులు లోకం బూచికి మా గుండె వణికితే మాకు ధైర్యమిచ్చేది మీ లాలింపే అమ్మనాన్నలిద్దరూ వేరు వేరయి అనాధలను చేయకండి పసిపిల్లలని ఆలోచించండి ఓ అమ్మానాన్నా ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా మీ ప్రేమ కోరే చిన్నారులం మీ ఒడిన ఆడే చందమామలం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి