చిత్రం: హలో బ్రదర్ (1994)
రచన: భువనచంద్ర
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.యస్.చిత్ర
సంగీతం:రాజ్-కోటి
పల్లవి :
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ
ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళ
చేరాలి సొగసుల తీరం..సాగాలి తకధిమి తాళం
తగ్గాలి తనువుల దూరం..తీరాలి వయసుల తాపం
ఓ..ఓ..ఓ...ఓ...
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ
ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళ
చరణం: 1 :
అల్లరి కోయిల పాడిన పల్లవి
స్వరాలలో నీవుంటే పదాలలో నేనుంటా
వేకువ పూచిన తొలితొలి గీతిక
ప్రియాప్రియా నీవైతే శృతీ లయా నేనౌతా
కలకాలం కౌగిలై నినే చేరుకోనీ
కనురెప్పల నీడలో కలై ఒదిగిపోనీ
ఓ ప్రియా...ఓ...
దరి చేరితే దాచుకోనా
తొలిప్రేమలే దోచుకోనా
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ
ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళ
చరణం: 2:
సవ్వడి చేయని యవ్వన వీణలు అలా అలా సవరించు పదే పదే పలికించు వయసులు కోరిన వెన్నెల మధువులు సఖీ చెలీ అందించు సుఖాలలో తేలించు పెదవులతో కమ్మని కథే రాసుకోనా ఒడిచేరి వెచ్చగా చలే కాచుకోనా ఓ ప్రియా...ఓ... పరువాలనే పంచుకోనీ పడుచాటలే సాగిపోనీ
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళ చేరాలి సొగసుల తీరం..సాగాలి తకధిమి తాళం తగ్గాలి తనువుల దూరం..తీరాలి వయసుల తాపం ఓ..ఓ..ఓ...ఓ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి