చిత్రం:జానీ(2003)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం:
గానం: రాజేష్ ,నందిత
ఏ చోట నువ్వున్నా నీ వెంటే వస్తున్నా
మనసు నిలవనంటే ఎలా ఆపను ఏ గాలి వీస్తున్నా నీ ఊసే వింటున్నా ఈ వింత భావం ఎలా చెప్పను ఇన్నాళ్ళు పక్కన లేవు కదా అనే మాట గుర్తుకురాదుకదా ఇన్నాళ్ళ ఒంటరితనమంతా నిన్ను చూసి తప్పుకు పోయిందా పెదవులకెన్నడు తెలియని నవ్వులు పరిచయమైనవి నీ వలన ఇదివరకెన్నడు కలగని ఆశలు మొదలవుతున్నవి నీ వలన ఏమైందో ఏమో నిజంగా లోకం మారిందో ఏమో కొత్తగా.... ఏ చోట నువ్వున్నా నీ వెంటే వస్తున్నా ఏ నడిరాతిరి నా దరి చేరక కావలి ఉందిగ నీ మమత నా ప్రతి ఊపిరి ఆయువు పోయగ వాడదుగా మన ప్రేమలత నూరేళ్ళు నీతో సాగనీ వెతికే ఆ స్వర్గం మనతో చేరనీ ఏ చోట నువ్వున్నా నీ వెంటే వస్తున్నా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి