Johnny లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Johnny లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, అక్టోబర్ 2022, ఆదివారం

Johnny : Ee Reyi Theyanadi Song Lyrics (ఈ రేయి తీయనిది)

చిత్రం : జానీ (2003)

సంగీతం : రమణ గోగుల

సాహిత్యం :

గానం: హరి హరన్, కవితా కృష్ణమూర్తి 




పల్లవి: ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి ఆ కొంటె మల్లికలు అల్లనదాగి వింటున్నవి చరణం 1: ఓ వరములా దొరికెనీ పరిచయం నా మనసులో కురిసెనే అమృతం నా నిలువునా అలలయే పరవశం నీ చెలిమికే చేయని అంకితం కోరుకునే తీరముగా ఆగెను ఈ నిమిషం ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి ఆ కొంటె మల్లికలు అల్లనదాగి వింటున్నవి చరణం 2: నీ ఊపిరే వెచ్చగా తగలని నా నుదుటిపై తిలకమై వెలగని నా చూపులే చల్లగా తాకని నీ పెదవిపై నవ్వుగా నిలవని ఆశలకే అయువుగా మారెను నీ స్నేహం ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది ఇంతకు మించి ఏమున్నది ఇంతకు మించి ఏమున్నది

20, జూన్ 2021, ఆదివారం

Johnny : Naaraz Kaakuraa Song Lyrics ( నారాజు గాకురా మా అన్నయా)

 చిత్రం:జానీ(2003)

సంగీతం: రమణ గోగుల

సాహిత్యం: 

గానం: రమణ గోగుల


మనిషి పుట్టినాక పుట్టింది మతము

పుట్టి ఆ మనిషినే వెనక్కి నెట్టింది మతము.. తల్లి కడుపులో వెల్లినట్టి మనిషి తలచకురా ఏ చెడ్డ గతము..
నారాజు గాకురా మా అన్నయా నజీరు అన్నయా ముద్దుల కన్నయా హొయ్.. మనరోజు మనకుంది మన్నయా నారాజు గాకురా మా అన్నయా నజీరు అన్నయా ముద్దుల కన్నయా అరె .. మనరోజు మనకుంది మన్నయో అనువు గాని చోట నువ్వు అధికుడన్న మాట అనవద్దు నంట నన్న వేమన్న గారి మాట వినలేదా నువ్వు బేటా ...బంగారు పలుకు మాట హెయ్..నారాజు గాకురా మా అన్నయా నజీరు అన్నయా ముద్దుల కన్నయా హొయ్ .. మనరోజు మనకుంది మన్నయో
చరణం : 1 అక్కన్నలు మాదన్నలు తానీషా మంత్రులుగా ఉన్ననాడే రామదాసు రాముని గుడి కట్టేనుగా.. కులీ కుతుబ్ షాహీ ప్రేమ ప్రేయసికి చిహ్నంగా భాగమతి పేర భాగ్యనగరము నిర్మించెనుగా.. నవాబులు నిర్మించిన నగరము లందు.. నవాబులు నిర్మించిన నగరము లందు.. కులమతాల గొడవలు మనకెందుకురన్నా ఇంకెందుకురన్నా ... హెయ్..నారాజు గాకురా మా అన్నయా నజీరు అన్నయా ముద్దుల కన్నయా హొయ్ .. మనరోజు మనకుంది మన్నయా
చరణం : 2 విన్నావా సోదరుడా.. మొన్న నీకు ధవఖానాలో జరిగినట్టి సంఘటన మానవతకు మచ్చ్సుతునక.. తన చావుతో ముస్లీము..మన హిందూ సోదరులకి ప్రాణదానమిచ్చిండు తన కిడ్నీలను తీసి మనుషులంతా ఒక్కటని శాస్త్రమన్నా.. మనుషులంతా ఒక్కటని శాస్త్రమన్నా.. మనుషుల్లో సైతానులకు పట్టదన్నా .. ఇది పట్టదన్నా .,. హెయ్..నారాజు గాకురా మా అన్నయా నజీరు అన్నయా ముద్దుల కన్నయా హొయ్ .. మనరోజు మనకుంది మన్నయా
చరణం : 3 పీర్ల పండగోచ్చిందా ..ఊర్లల్లో మనవాళ్ళు డప్పుల దరువేసుకుంటూ కోలాటలు ఆడుతారు.. సదరు పండగోచ్చిందా..పట్నంలో ప్రతివారు దున్నపోతులాడిస్తూ దిల్ ఖుషీలు చేస్తుంటరు ఎవడేమి అంటే మనకేమిటన్నా ఎవడేమి అంటే మనకేమిటన్నా జాషువా విశ్వనరుడు నువ్వే రన్నా ..ఎప్పుడు నువ్వేరన్నా..
హెయ్..నారాజు గాకురా మా అన్నయా నజీరు అన్నయా ముద్దుల కన్నయా హొయ్ .. మనరోజు మనకుంది మన్నయో
నమ్మొద్దు నమ్మొద్దురన్నో నాయకుణ్ణి గుమ్మానికి ఉరి తీస్తాడమ్మో నమ్మినోన్ని .. నమ్మొద్దు నమ్మొద్దురన్నో నాయకుణ్ణి గుమ్మానికి ఉరి తీస్తాడమ్మో నమ్మినోన్ని .. తన బతుకులో వెలుగు కొరకు నాయకుడు మన దీపాలార్పేస్తాడమ్మో నాయకుడు.. తన బతుకులో వెలుగు కొరకు నాయకుడు మన దీపాలార్పేస్తాడమ్మో నాయకుడు.. మా దేవుడు గొప్పంటాడమ్మో నాయకుడు.. మా ధర్మం భేషంటాడమ్మో నాయకుడు.. మా గుడిలో మొక్కంటాడమ్మో నాయకుడు.. మా ప్రార్థన చేయంటాడమ్మో నాయకుడు.. దేవుళ్ళని అడ్డంగా పెట్టి.. నాయకుడు దేవుళ్ళనే దోచేస్తాడమ్మో నాయకుడు.. అధికారం , తన పదవి కొరకు నాయకుడు మత కలహం మంటేస్తాడమ్మో నాయకుడు.. మత కలహం మంటేస్తాడమ్మో నాయకుడు.. మత కలహం మంటేస్తాడమ్మో నాయకుడు.. మత కలహం మంటేస్తాడమ్మో నాయకుడు.. మత కలహం మంటేస్తాడమ్మో నాయకుడు

Johnny : Ee Chota Nuvvunna Song Lyrics ( ఏ చోట నువ్వున్నా నీ వెంటే వస్తున్నా)

చిత్రం:జానీ(2003)

సంగీతం: రమణ గోగుల

సాహిత్యం: 

గానం: రాజేష్ ,నందిత



 ఏ చోట నువ్వున్నా నీ వెంటే వస్తున్నా

మనసు నిలవనంటే ఎలా ఆపను ఏ గాలి వీస్తున్నా నీ ఊసే వింటున్నా ఈ వింత భావం ఎలా చెప్పను ఇన్నాళ్ళు పక్కన లేవు కదా అనే మాట గుర్తుకురాదుకదా ఇన్నాళ్ళ ఒంటరితనమంతా నిన్ను చూసి తప్పుకు పోయిందా పెదవులకెన్నడు తెలియని నవ్వులు పరిచయమైనవి నీ వలన ఇదివరకెన్నడు కలగని ఆశలు మొదలవుతున్నవి నీ వలన ఏమైందో ఏమో నిజంగా లోకం మారిందో ఏమో కొత్తగా....  ఏ చోట నువ్వున్నా నీ వెంటే వస్తున్నా ఏ నడిరాతిరి నా దరి చేరక కావలి ఉందిగ నీ మమత నా ప్రతి ఊపిరి ఆయువు పోయగ వాడదుగా మన ప్రేమలత నూరేళ్ళు నీతో సాగనీ వెతికే ఆ స్వర్గం మనతో చేరనీ  ఏ చోట నువ్వున్నా నీ వెంటే వస్తున్నా