చిత్రం: కిల్లర్ (1992)
సాహిత్యం: వేటూరి
గానం: మనో , కె.యస్.చిత్ర
సంగీతం: ఇళయరాజా
ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు నీ లయ పంచుకుంటుంటే. నా శృతిమించి పోతుంటే నాలో రేగే ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు జగాలు లేని సీమలో యుగాలు దాటే ప్రేమలు పెదాల మూగ పాటలో పదాలు పాడే ఆశలు ఎవరులేని మనసులో, ఎదురు రావే నా చెలి అడుగు జారే వయసులో అడిగి చూడు కౌగిలి ఒకే వసంతం కుహు నినాదం నీలో నాలో పలికే ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు నీ లయ పంచుకుంటుంటే నా శృతిమించి పోతుంటే నాలో రేగే ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు శరత్ లోనా వెన్నెలా తలెత్తుకుంది కన్నులా షికారు చేసే కోకిలా పుకారువేసే కాకిలా ఎవరు ఎంత వగచినా చిగురు వేసే కోరికా నింగి తానే విడిచినా ఇలకు రాదు తారకా మదే ప్రపంచం విదే విలాసం నన్ను నిన్ను కలిపే ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు నీ లయ పంచుకుంటుంటే నా శృతిమించి పోతుంటే నా లో రేగే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి