చిత్రం: ముద్దుల మొగుడు (1997)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం: కోటి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , సుజాత
పల్లవి:
ఆలపించె అణువు అణువు స్వాగతాంజలి ఆలకించి మేలుకుంది నీ అనార్కలి వేచివుంది వలపు లోగిలి.. ఓ.. ఓ రావే రాజహంసలా నీవే రెండు కన్నుల నిండి ఉండిపోవే వెన్నెలా రారా రాజశేఖరా నీకే రాజధానిలా వేచివున్న ఎదనే ఏలరా ఓ చిలిపి కల.. ఓ వలపు వల జరపవే జతపడు లీలా రావే రాజహంసలా నీవే రెండు కన్నుల నిండి ఉండిపోవే వెన్నెలా
చరణం 1:
అందాల సారమా మందార హారమా నీ తేనెలో తేలించుమా.. గంగా సమీరమా శృంగార తీరమా నీ లీలలో లాలించుమా.. అధర సుధల మృదుహాసమా మదికి మొదటి మధుమాసమా మదన కథల ఇతిహాసమా మనసుపడిన దొరవే సుమా.. సదా గులామై సఖీ సలాం అను సలీం చెలిమినే ఆదరించుమా రారా రాజశేఖరా నీకే రాజధానిలా వేచివున్న ఎదనే ఏలరా చరణం 2:
మేఘాల చంద్రమా మోహాల మంత్రమా నా ప్రాయమే పాలించుమా రాగాల సంద్రమా లాగేటి బంధమా నా శ్వాసనే శాసించుమా బ్రతుకు నడుపు అనురాగమా మనసు తెలిసి దయచేయుమా తలపు తెలుపుకొను మౌనమా తెరలు తెరచి ననుజేరుమా.. జగాలలో ప్రతి యుగానికీ మన కథే నిలుచునని చాటి చూపుమా రావే రాజహంసలా నీవే రెండు కన్నుల నిండి ఉండిపోవే వెన్నెలా ఓ చిలిపి కల.. ఓ వలపు వల జరపవే జతపడు లీలా రారా రాజశేఖరా నీకే రాజధానిలా వేచివున్న ఎదనే ఏలరా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి