చిత్రం:అల్లరి అల్లుడు(1993)
సంగీతం: M.M.కీరవాణి
గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
పల్లవి:
కమ్మని ఒడి బొమ్మని పెదవిమ్మని అడిగావే
చమ్మని బదులిమ్మని జత కమ్మని పిలిచావే
గొడుగులో రాగం ... అడుగులో తాళం
నిషాలలో వేసేయ్ బాణం
రసాలలో తృణం ఫణం
కమ్మని ఒడి బొమ్మని పెదవిమ్మని అడిగావే
చరణం:
మిడిసి పడకే తొలి సొగసు మొగలి పూరేకా
కసా బుసా కసా కసిగా
పడగ విడిచి విరి పడక పరుచుకున్నాగా
పగా వగా ఇదే పదరా
చినుకు పడి చీర జారే ... మెరుపు మెడ హారమేసే
ఉరుము జతిలో నడుము లయలో చలో లేలో
తడిసే నీ రూపం ... తళుకులో దీపం
వయస్సులో వానే వస్తే ... తడి స్వరం చలి జ్వరం
కమ్మని ఒడి బొమ్మని పెదవిమ్మని అడిగావే
చమ్మని బదులిమ్మని జత కమ్మని పిలిచావే
చరణం:2
గుబులు గుబులు మొదలగులు పెరిగే వొళ్ళంతా
సడేమియా తడి పొడిగా
చిగురు పొగరు చెలి ఫిగరు కెదిగి తుళ్ళింతా
పదే పదే అదే పనిగా
జడ తడిసి జావళీలై మెడలగడ తాళమేసే
ఇరుకు ఇరుకు ఉడుకు దుడుకు చలాకీలో
అడిగితే అందం ... అధరమే బంధం
అయోమయం ఆషాఢంలో ప్రియా ప్రియం స్వయంవరం
కమ్మని ఒడి బొమ్మని పెదవిమ్మని అడిగావే
చమ్మని బదులిమ్మని జత కమ్మని పిలిచావే
గొడుగులో రాగం ... అడుగులో తాళం
నిషాలలో వేసేయ్ బాణం
రసాలలో తృణం ఫణం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి