28, జూన్ 2021, సోమవారం

Na Autograph : Mounamgane Yedagamani Song Lyrics (మౌనంగానే ఎదగమని)

చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)

రచన: చంద్రబోస్

గానం: కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి


మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థ మందిలో ఉందీ అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందిలో ఉంది అపజయాలు కలిగిన చోటె గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా బాధ వెనుక నువ్వుల పంట ఉంటుందిగా సాగరమథనం మొదలవగానే విషమే వచ్చింది విసుగే చెందక కృషి చేస్తేనే అమృత మీచ్చింది అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది తెలుసుకుంటే సత్యమిది తలచుకుంటే సాధ్యమిది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. చెమట నీరు చిందగా నుదిటి రాత మార్చుకో మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో పిడికిలే బిగించగా చేతిగీత మార్చుకో మారిపోని కథలే లేవని గమనించుకో తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి మా ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా మా ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా మా సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి