Na Autograph లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Na Autograph లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, నవంబర్ 2021, ఆదివారం

Naa Autograph : Nuvvante Pranamani Song Lyrics (నువ్వంటే ప్రాణమని)

చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)

రచన: చంద్రబోస్

గానం: విజయ్ ఏసుదాస్

సంగీతం: ఎం. ఎం. కీరవాణి


నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికీ చెప్పుకోను., నాకు తప్ప కన్నులకి కలలు లేవు నీరు తప్ప నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికీ చెప్పుకోను., నాకు తప్ప కన్నులకి కలలు లేవు నీరు తప్ప నననాన ...నన.నన... నననాన ...నన.నన ల ల ల లా ల ల ల లా ల ల ల లా ఆ.ఆ... ఆ... ఆ... ఆఆఆఆ మనసు ఉంది..., మమత ఉంది., పంచుకునే నువ్వు తప్ప ఊపిరి ఉంది., ఆయువు ఉంది..., ఉండాలనే ఆశ తప్ప ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా ప్రేమిస్తేనే సుధీర్గ నరకం నిజమేనా ఎవరిని అడగాలి., నన్ను తప్ప చివరికి ఏమవాలి..., మన్ను తప్ప నువ్వంటే ప్రాణమని..., నీతోనే లోకమని నీ ప్రేమే లేకుంటే., బ్రతికేది ఎందుకని ఆ.ఆ... ఆ... ఆ... ఆఆఆఆ వెంటోస్తానన్నావ్వు..., వెళ్ళోస్తానన్నావ్వు..., జంటై ఒకరి పంటై ఎళ్ళావు..., కరుణిస్తానన్నావ్వు., వరమిస్తానన్నావ్వు..., బరువై... మెడకు... ఉరివై పోయావు... దేవతలోను ద్రోహం ఉందని తెలిపావు... దీపం కూడా దహిస్తుందని తేల్చావు... ఎవరిని నమ్మలి..., నన్నుతప్ప ఎవరిని నిందించాలి..., నిన్నుతప్ప నువ్వంటే ప్రాణమని., నీతోనే లోకమని నీ ప్రేమే లేకుంటే..., బ్రతికేది ఎందుకని ఎవరికీ చెప్పుకోను..., నాకు తప్ప కన్నులకి., కలలు లేవు., నీరు తప్ప...

14, జులై 2021, బుధవారం

Naa Autograph : Duvvina Talane Song Lyrics (దువ్విన తలనే దువ్వటం)

చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)

రచన: చంద్రబోస్

గానం: ఎం. ఎం. కీరవాణి, సుమంగళి

సంగీతం: ఎం. ఎం. కీరవాణి


దువ్విన తలనే దువ్వటం అద్దిన పౌడరు అద్దడం దువ్విన తలనే దువ్వటం అద్దిన పౌడరు అద్దడం అద్దం వదలక పోవడం అందానికి మెరుగులు దిద్దడం నడిచి నడిచి ఆగడం ఆగి ఆగి నవ్వడం ఉండి ఉండి అరవడం తెగ అరచి చుట్టూ చూడడం ఇన్ని మార్పులకు కారణం ఎమై ఉంటుందోయి ఇది కాదా LOVE ఇది కాదా LOVE ఇది కాదా LOVE ఇది కాదా LOVE ఇది కాదా LOVE ఇది కాదా LOVE ఇది కాదా LOVE ఇది కాదా LOVE ఇది కాదా LOVE ఇది కాదా LOVE ఇది కాదా LOVE ఇది కాదా LOVE ఇది కాదా LOVE ఇది కాదా LOVE ముఖమున మొటిమే రావడం మనస్సుకు చెమటే పట్టడం మతి మరుపెంతో కలగడం మతి స్థిమితం పూర్తిగా తప్పడం త్వరగా స్నానం చెయ్యడం త్వరత్వరగా భోం చేస్తుండడం త్వరగా కలలో కెళ్ళడం ఆలస్యంగా నిదురోవడం ఇన్నర్థాలకు ఒకే పదం ఏమై ఉంటుందోయి ఇది కాదా LOVE ఇది కాదా LOVE ఇది కాదా LOVE ఇది కాదా LOVE ఇది కాదా LOVE ఇది కాదా LOVE ఇది కాదా LOVE ఇది కాదా LOVE ఇది కాదా LOVE ఇది కాదా LOVE ఇది కాదా LOVE ఇది కాదా LOVE ఇది కాదా LOVE ఇది కాదా LOVE ఇది కాదా LOVE

2, జులై 2021, శుక్రవారం

Naa Autograph (Sweet Memories) : Manmadhude Song Lyrics (మన్మధుడే బ్రహ్మను పూని )

చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)

రచన: చంద్రబోస్

గానం: సందీప్, గంగ

సంగీతం: ఎం. ఎం. కీరవాణి


మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో కానీ 50 కేజీల మందారాన్ని

అయిదున్నర అడుగుల బంగారాన్ని

పలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలు కొమ్మని ||||మన్మధుడే బ్రహ్మను పూని|||


దీన్ని తెలుగులో కారం అంటారు. మరి మలయాళలో?- ఇరువు ఓహో

ఇది తీపి మీ భాషలో- మధురం

మరి చేదు చేదు చేదు- కైకు


ఆరే రుచులని అనుకున్నానే నిన్నటి వరకు

ఏడే రుచినే కనుగొన్నానే నీ ప్రేమతో

రుజిగల్ ఆరిం నాన్ కడుం ఇన్నలి వరియల్  ఇన్నలి వరియల్

ఎలాం రుజుయు వుండెన్ తరుయు నీ ప్రేమతో

నిన్నటిదాకా నాలుగు దిక్కులు ఈ లోకంలో

ఇన్ ముదల్ నువ్వే దిక్కు ఎల్లో గత్తిల్

ఏ మనిషిలాయే

నీ పలుకులే కీరవాణి నా పెదవితో తాళం వెయ్యని


మాధవుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని

అరవై కేజిల చిలిపితనాన్ని.

అలుపన్నది ఎరుగని రవితేజాన్ని


పెదాలనేమంటారు- చుండు

నడుముని- ఇడుప్పు

నా పెదాలతో నీ నడుముమీద ఇలా చేస్తే ఏమంటారు?

ఆశ దోశ  అమ్ము మిండ మీసా

ఏయ్! చెప్పమంటుంటే- చెప్పనా..


రెండో మూడో కావాలమ్మా భూతద్దాలు భూతద్దాలు

ఉందో లేదో చూడాలంటే నీ నడుముని

వందలకొద్దీ కావాలంట జలపాతాలు

పెరిగే కొద్దీ తీర్చాలంటే నీ వేడిని

లెక్కకు మించి జరగాలమ్మ మొదటి రాత్రులు

మక్కువ తీరక చెయ్యాలంటే మధుర యాత్రలు

విన్నాను నీ హృదయవాణి

వెన్నెల్లో నిన్ను చేరని


మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని

అరవై కేజీల దుడుకుతనాన్ని

అలుపన్నది ఎరుగని రవితేజాన్ని

పలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలు కోమ్మని..




Naa Autograph(Sweet Memories) : Gamma Gamma Hangamma Song Lyrics (గామా గామా హంగామా)

చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)

రచన: చంద్రబోస్

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , శ్రీవర్ధిని, పూర్ణిమ

సంగీతం: ఎం. ఎం. కీరవాణి


గామా గామా హంగామా

మనమే హాయి చిరునామా

పాత బాధ గదిని ఖాళీ చేద్దామా

గామా గామా హంగామా

కష్టం ఖర్చు పెడదామా

కొత్త సంతోషం జమ చేద్దామా ...గామా


నీ రాకతో రాయిలాంటి

నా జీవితానికే జీవం వచ్చింది

నీ చూపుతో జీవం వచ్చిన రాయే

చక్కని శిల్పం అయ్యింది

చేయూతతో శిల్పం కాస్తా

నడకలు నేర్చి కోవెల చేరింది

నీ నవ్వుతో కోవెల చేరిన శిల్పంలోన

కోరిక కలిగింది

ఆ కోరికేమిటో చెప్పని

నను వీడి నువ్వు వెళ్లొద్దని

మళ్లీ రాయిని

చెయ్యొద్దని... ...గామా....


నీ మాటతో నాపై నాకే ఏదో తెలియని

నమ్మకమొచ్చింది

నీ స్ఫూర్తితో ఎంతో ఎంతో

సాధించాలని తపనే పెరిగింది

నీ చెలిమితో ఊహల్లోన ఊరిస్తున్న

గెలుపే అందింది

ఆ గెలుపుతో నిస్పృహలోన

నిదురిస్తున్న మనసే మురిసింది

ఆ మనసు అలసి పోరాదని

ఈ చెలిమి నిలిచిపోవాలని

ఇలా బ్రతుకును గెలవాలని... ... గామా ....


28, జూన్ 2021, సోమవారం

Na Autograph : Mounamgane Yedagamani Song Lyrics (మౌనంగానే ఎదగమని)

చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)

రచన: చంద్రబోస్

గానం: కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి


మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థ మందిలో ఉందీ అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందిలో ఉంది అపజయాలు కలిగిన చోటె గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా బాధ వెనుక నువ్వుల పంట ఉంటుందిగా సాగరమథనం మొదలవగానే విషమే వచ్చింది విసుగే చెందక కృషి చేస్తేనే అమృత మీచ్చింది అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది తెలుసుకుంటే సత్యమిది తలచుకుంటే సాధ్యమిది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. చెమట నీరు చిందగా నుదిటి రాత మార్చుకో మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో పిడికిలే బిగించగా చేతిగీత మార్చుకో మారిపోని కథలే లేవని గమనించుకో తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి మా ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా మా ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా మా సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది