Nuvve Nuvve : Niddura Potunna Song Lyrics ( నిద్దరపోతున్న రాతిరినడిగా)
చిత్రం : నువ్వే నువ్వే(2002)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: శంకర్ మహదేవన్
చెలియా నీవైపే వస్తున్నా కంటపడవా ఇకనైనా...ఎక్కడున్నా నిద్దరపోతున్న రాతిరినడిగా గూటికి చేరిన గువ్వలనడిగా చల్లగాలినడిగా ఆ చందమామనడిగా ప్రియురాలి జాడ చెప్పరేమనీ అందరినీ ఇలా వెంటపడి అడగాలా సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా చల్లగాలినడిగా ఆ చందమామనడిగా ప్రియురాలి జాడ చెప్పరేమనీ చరణం : 1 ఓ... అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణం అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణం అరెరే పాపమనీ జాలిగా చూసే జనం.. గోరంత గొడవ జరిగితే కొండంత కోపమా నన్నొదిలి నువ్వు ఉండగలవ నిజం చెప్పవమ్మా అందరినీ ఇలా వెంటపడి అడగాలా సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా నిద్దరపోతున్న రాతిరినడిగా గూటికి చేరిన గువ్వలనడిగా చల్లగాలినడిగా ఆ చందమామనడిగా ప్రియురాలి జాడ చెప్పరేమనీ చరణం : 2 ఓ... నువ్వు నా ప్రాణం అని విన్నవించు ఈ పాటని నువ్వు నా ప్రాణమని విన్నవించు ఈ పాటని ఎక్కడో దూరానున్నా చుక్కలే విన్నా గాని.. కదిలించలేద కాస్త కూడ నీ మన స్సుని మరణాలు దాటి ఒక్కసారి పలకరించవేమే అందరినీ ఇలా వెంటపడి అడగాలా సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా నిద్దరపోతున్న రాతిరినడిగా గూటికి చేరిన గువ్వలనడిగా చల్లగాలినడిగా ఆ చందమామనడిగా ప్రియురాలి జాడ చెప్పరేమనీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి