చిత్రం : నువ్వే నువ్వే(2002)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: ఉదిత్ నారాయణ, నిత్య సంతోషిణి
నా మనసుకేమయింది నీ మాయలో పడింది.. నిజమా కలా తెలిసేదెలా.. నాకు అలాగె ఉంది ఎన్నో అనాలనుంది.. దాచేదెలా లోలోపలా.. మన ఇద్దరికి తెలియంది ఏదో జరిగే ఉంటుంది.. అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతు ఉంది.. నా మనసుకేమయింది నీ మాయలో పడింది.. నిజమా కలా తెలిసేదెలా.. చుక్కలే తెచ్చి ఇవ్వనా అంది నీ మీద నాకున్న ప్రేమ.. కొత్తగా ఉంది బొత్తిగా నమ్మలేనంత ఈ వింత ధీమా.. జంటగా వెంట నువ్వుంటే అందడా నాకు ఆ చందమామ.. అందుకే నాకు నువ్వంటే మాటలో చెప్పలేనంత ప్రేమ.. పంచుకున్న ముద్దులో ఇలా జతే పడి.. పెంచుకున్న మత్తులో పడి మతే చెడి.. గాలితో చెప్పనీ మన మొదటి గెలుపు ఇదని.. నా మనసుకేమయింది నీ మాయలో పడింది.. నిజమా కలా తెలిసేదెలా.. ఎప్పుడూ గుండె చప్పుడు కొట్టుకుంటుంది నీ పేరు లాగ.. ఎప్పుడో అప్పుడప్పుడు గుర్తుకొస్తొంది నా పేరు కొద్దిగ.. ఒంటిగా ఉండనివ్వదు కళ్ళలో ఉన్న నీ రూపురేఖ.. ఇంతగా నన్ను ఎవ్వరూ కమ్ముకోలేదు నీలా ఇలాగ.. లోకమంటే ఇద్దరే అదే మనం అని.. స్వర్గమంటే ఇక్కడే అంటే సరే అని .. వెన్నెలే పాడనీ మన చిలిపి చెలిమి కథని... నా మనసుకేమయింది నీ మాయలో పడింది.. నిజమా కలా తెలిసేదెలా.. మన ఇద్దరికి తెలియంది ఏదో జరిగే ఉంటుంది.. అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతు ఉంది..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి