Nuvve Nuvve లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Nuvve Nuvve లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, జూన్ 2021, సోమవారం

Nuvve Nuvve : Nuvve Nuvve Kavalantundi Song Lyrics (ఏ చోట ఉన్నా... నీ వెంట లేనా)

 

చిత్రం : నువ్వే నువ్వే(2002)

సంగీతం: కోటి

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి 

గానం: చిత్ర


ఏ చోట ఉన్నా... నీ వెంట లేనా సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే రేపు లేని చూపు నేనై శ్వాస లేని ఆశ నేనై మిగలనా నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతీక్షణం నా మౌనం ఏ చోట ఉన్నా... నీ వెంట లేనా సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే నేల వైపు చూసి నేరం చేసావని నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకుని గాలి వెంట వెళ్ళే మారం మానుకోమని తల్లి తీగ బంధిస్తుందా మల్లె పువ్వుని ఏమంత పాపం ప్రేమా ప్రేమించటం ఇకనైనా చాలించమ్మా వేధించటం చెలిమై కురిసే సిరివెన్నెలవా క్షణమై కరిగే కలవా నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతీక్షణం నా మౌనం రేపు లేని చూపు నేనై శ్వాస లేని ఆశ నేనై మిగలనా వేలు పట్టి నడిపిస్తుంటే చంటి పాపలా నా అడుగులు అడిగే తీరం చేరేదెలా వేరెవరో చూపిస్తుంటే నా ప్రతి కల కంటి పాప కోరే స్వప్నం చూసేదెలా నాక్కూడ చోటే లేని నా మనసులో నిన్నుంచగలనా ప్రేమ ఈ జన్మలో వెతికే మజిలీ దొరికే వరకు నడిపే వెలుగై రావా నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతీక్షణం నా మౌనం ఏ చోట ఉన్నా... నీ వెంట లేనా సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే

Nuvve Nuvve : Niddura Potunna Song Lyrics ( నిద్దరపోతున్న రాతిరినడిగా)

చిత్రం : నువ్వే నువ్వే(2002)

సంగీతం: కోటి

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి 

గానం: శంకర్ మహదేవన్


చెలియా నీవైపే వస్తున్నా కంటపడవా ఇకనైనా...ఎక్కడున్నా నిద్దరపోతున్న రాతిరినడిగా గూటికి చేరిన గువ్వలనడిగా చల్లగాలినడిగా ఆ చందమామనడిగా ప్రియురాలి జాడ చెప్పరేమనీ అందరినీ ఇలా వెంటపడి అడగాలా సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా చల్లగాలినడిగా ఆ చందమామనడిగా ప్రియురాలి జాడ చెప్పరేమనీ చరణం : 1 ఓ... అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణం అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణం అరెరే పాపమనీ జాలిగా చూసే జనం.. గోరంత గొడవ జరిగితే కొండంత కోపమా నన్నొదిలి నువ్వు ఉండగలవ నిజం చెప్పవమ్మా అందరినీ ఇలా వెంటపడి అడగాలా సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా నిద్దరపోతున్న రాతిరినడిగా గూటికి చేరిన గువ్వలనడిగా చల్లగాలినడిగా ఆ చందమామనడిగా ప్రియురాలి జాడ చెప్పరేమనీ చరణం : 2 ఓ... నువ్వు నా ప్రాణం అని విన్నవించు ఈ పాటని నువ్వు నా ప్రాణమని విన్నవించు ఈ పాటని ఎక్కడో దూరానున్నా చుక్కలే విన్నా గాని.. కదిలించలేద కాస్త కూడ నీ మన స్సుని మరణాలు దాటి ఒక్కసారి పలకరించవేమే అందరినీ ఇలా వెంటపడి అడగాలా సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా నిద్దరపోతున్న రాతిరినడిగా గూటికి చేరిన గువ్వలనడిగా చల్లగాలినడిగా ఆ చందమామనడిగా ప్రియురాలి జాడ చెప్పరేమనీ

Nuvve Nuvve : Naa Manusukemayindi Song Lyrics (నా మనసుకేమయింది నీ మాయలో పడింది..)

 చిత్రం : నువ్వే నువ్వే(2002)

సంగీతం: కోటి

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి 

గానం: ఉదిత్ నారాయణ, నిత్య సంతోషిణి


నా మనసుకేమయింది నీ మాయలో పడింది.. నిజమా కలా తెలిసేదెలా.. నాకు అలాగె ఉంది ఎన్నో అనాలనుంది.. దాచేదెలా లోలోపలా.. మన ఇద్దరికి తెలియంది ఏదో జరిగే ఉంటుంది.. అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతు ఉంది.. నా మనసుకేమయింది నీ మాయలో పడింది.. నిజమా కలా తెలిసేదెలా.. చుక్కలే తెచ్చి ఇవ్వనా అంది నీ మీద నాకున్న ప్రేమ.. కొత్తగా ఉంది బొత్తిగా నమ్మలేనంత ఈ వింత ధీమా.. జంటగా వెంట నువ్వుంటే అందడా నాకు ఆ చందమామ.. అందుకే నాకు నువ్వంటే మాటలో చెప్పలేనంత ప్రేమ.. పంచుకున్న ముద్దులో ఇలా జతే పడి.. పెంచుకున్న మత్తులో పడి మతే చెడి.. గాలితో చెప్పనీ మన మొదటి గెలుపు ఇదని.. నా మనసుకేమయింది నీ మాయలో పడింది.. నిజమా కలా తెలిసేదెలా.. ఎప్పుడూ గుండె చప్పుడు కొట్టుకుంటుంది నీ పేరు లాగ.. ఎప్పుడో అప్పుడప్పుడు గుర్తుకొస్తొంది నా పేరు కొద్దిగ.. ఒంటిగా ఉండనివ్వదు కళ్ళలో ఉన్న నీ రూపురేఖ.. ఇంతగా నన్ను ఎవ్వరూ కమ్ముకోలేదు నీలా ఇలాగ.. లోకమంటే ఇద్దరే అదే మనం అని.. స్వర్గమంటే ఇక్కడే అంటే సరే అని .. వెన్నెలే పాడనీ మన చిలిపి చెలిమి కథని... నా మనసుకేమయింది నీ మాయలో పడింది.. నిజమా కలా తెలిసేదెలా.. మన ఇద్దరికి తెలియంది ఏదో జరిగే ఉంటుంది.. అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతు ఉంది..