27, జూన్ 2021, ఆదివారం

Pournami : Bharatha Vedamuga Song Lyrics (భరత వేదముగ)

చిత్రం: పౌర్ణమి (2006)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: కె.ఎస్. చిత్ర

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్


పల్లవి :

శంభో శంకర హర హర మహాదేవ (4)

తద్ధింతాదిది ధింధిమీ పరుల తాండవకేళీతత్పర

గౌరీమంజుల సింజిణీ జతుల లాస్యవినోదవ శంకర


భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశ

శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదముపరేశ

నీలకందరా జాలిపొందరా కరుణతొ ననుగనరా

నీలకందరా శైలమందిరా మొరవిని బదులిడరా

నగజామనోజ జగదీశ్వరా మాలేందుశేఖరా శంకరా

భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశ

శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదముపరేశ

హర హర మహాదేవ (4)


చరణం:1

ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...

ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...

ఆ... అంతకాంత ఈ సతి అగ్నితప్తమైనది

మేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనదీ...

ఆదిశక్తి ఆకృతి అద్రిజాత పార్వతి

తాణువైన ప్రాణధవుని చెంతకు చేరుతున్నదీ...

ఆ... ఆ... భవుని భువికి తరలించేలా ధరణి దివిని తలపించేలా

రసతరంగిణీ లీల యతిని నృత్యరతుని చేయగలిగే ఈ... వేళ


భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశ

శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదముపరేశ


చరణం:2

జంగమ సావర గంగాచ్యుత శిర భృతమంజులకర పురహరా

భక్తశుభంకర భవనా శంకర స్వరహర దక్షాత్వర హరా

పాలవిలోచన పాలిత జనగణ కాల కాల విశ్వేశ్వర

ఆసుతోష అథనాశ విశాషణ జయగిరీశ బృహదీశ్వరా

హర హర మహాదేవ

హర హర మహాదేవ

వ్యోమకేశ నిను హిమగిరి వరసుత ప్రేమపాశమున పిలువంగా

యోగివేష నీ మనసున కలగద రాగలేశమైనా

హే మహేశ నీ భయదపదాహతి దైత్యశోషణము జరుపంగ

భోగిభూష భువనాళిని నిలుపవ అభయముద్రలోన

నమక చమకముల నాదాన యమక గమకముల యోగాన

పలుకుతున్న ప్రాణాన ప్రణవనాద ప్రథమనాథ శృతివినరా

హర హర మహాదేవ.....


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి