Pournami లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Pournami లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, మార్చి 2024, శుక్రవారం

Pournami : Ichi Pucchukunte Song Lyrics (ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది )

చిత్రం: పౌర్ణమి (2006)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: టిప్పు, సుమంగళి

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 



పల్లవి :

హే ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది ఇచ్చేయ్ నీ మనసు

ఇచ్ఛేసేయ్ ఇచ్ఛేసేయ్ ఇచ్ఛేయ్ మరి

హరే ఇద్దరొక్కటైతే సరిపోతుంది ఇచ్చేయ్ నీ సొగసు హై

ఇచ్ఛేసేయ్ ఇచ్ఛేసేయ్ ఇచ్ఛేయ్ మరి

మూర్తమెందుకు మురిపాల విందుకు

ముందు ముందుకు మితిమీరమెందుకు

అబ్బాయనాలి ముద్దిమ్మని అమ్మాయనాలి వద్దొద్దని

నువ్వేంటిలాగా హయ్యో కన్యామణి.. మణి.. మణి...


హే ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది ఇచ్చేయ్ నీ మనసు

ఇచ్ఛేసేయ్ ఇచ్ఛేసేయ్ ఇచ్ఛేయ్ మరి


చరణం:1

ఊ మహారాజా హై హై

నువ్వు వున్న మాట ఒప్పుకుంటే పోదా

ఈ జింక మీద బెంగ పుట్ట లేదా 

ఓ ఓ మూళ్ళ రోజా హాయ్ హాయ్

ఓ చిన్నమెట్టు భయ పడరాదా

నేను దాడి చేస్తే లేని పోని బాధ

కొంటె తేటు పంటి గాటు కి

లేత పూల తీగె కందిపోదయా

జంట లేని వొంటి వేదిక

చందానాల పూట వుంది రావయ్యా

అబ్బాయనాలి ముద్దిమ్మని అమ్మాయనాలి వద్దొద్దని

నువ్వేంటిలాగా హయ్యో కన్యామణి.. మణి.. మణి...


హే ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది ఇచ్చేయ్ నీ మనసు

ఇచ్ఛేసేయ్ ఇచ్ఛేసేయ్ ఇచ్ఛేయ్ మరి


చరణం:2

ఊ నేల రాజా ఈ ముత్యమంతి మత్స్యకాంతి సైగ

నిన్ను రేచగొట్టి వెచ్చా బెట్ట లేదా

హేయ్ వల రాజా ఈ పిల్ల వొళ్లు తల్లడిల్లి పోగా

నువ్వు చెరుకు వేళ్ళు ఎత్తి పెట్టి రాక

చాటు మాట చూపు దేనికి

సొంత మైన సొంపు చూడడానికి

దొంగ లాగా జంకు దేనికి దొర లాగా సోకు లేడదని

అబ్బాయనాలి ముద్దిమ్మని అమ్మాయనాలి వద్దొద్దని

నువ్వేంటిలాగా హయ్యో కన్యామణి.. మణి.. మణి...


హే ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది ఇచ్చేయ్ నీ మనసు

ఇచ్ఛేసేయ్ ఇచ్ఛేసేయ్ ఇచ్ఛేయ్ మరి

హరే ఇద్దరొక్కటైతే సరిపోతుంది ఇచ్చేయ్ నీ సొగసు హై

ఇచ్ఛేసేయ్ ఇచ్ఛేసేయ్ ఇచ్ఛేయ్ మరి

                                                          






                                                     

Pournami : Koyo Koyo Song Lyrics (కోయో....కోయో)

చిత్రం: పౌర్ణమి (2006)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: షాన్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్



పల్లవి :

కోయో....కోయో కోయో....కోయో............ కోయో....కోయో కోయో....కోయో........... .. కొయ్యో....కోయో

చరణం:1

లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ ఎక్కడ ఉండో ఏమో నీ మంజిల్ అత్తె ఆలోచించాక ఆగే చల్ ఓరి దేవుడో ఎల్లగానీ... ఊరుకోరో ఊసరాని ఆట పాటగా ప్రతి పని...  సాధించాయ్ ఏమనినా కానీ కోయో....కోయొ 

కొండలో..కోనలో... ఏవో ఎదురైనా.. ఎండలో వానలో... మన వేగం క్షణమైనా నిలిచేనా... చేరాలా...కలల కోట, రణమేరా రాచ బాట.

ఓరి దేవుడో ఎల్లాగానీ... ఊరుకోరో ఊసరాని. .  

సాధించాయ్ ఏమనినా కాని బాధని..

చేదని..ఏదో ఒక పేర.. బ్రతకడం.. బరువాని..

చరణం:2 బాధని..చేదనీ.. ఏదో ఒక పేరా? బతకడం బరువని.. అడుగడుగు..తలబడుతూ నిలవాలా? రేపంటే, తేనెపట్టు.. ముల్లున్నా దాని చుట్టూ.. ఓరి దేవుడో ఎలా అని, వూరుకూకురో ఉస్సూరని, ఆటపాటగా ప్రతీ పనీ సాధించేయ్ ఏమైనా గానీ .

కోయో....కోయో

28, మార్చి 2024, గురువారం

Pournami : Bhavyamaina Song Lyrics (భవ్యమైన ఆత్మ భావం )

చిత్రం: పౌర్ణమి (2006)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: జైదేవ్, పుణ్య శ్రీనివాస్ (వీణ), శ్రీనివాస్ (జాతి)

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్



భవ్యమైన ఆత్మ భావం రమ్యమైన జీవ రాగం నవ్యమైన నిత్య తాళం నిఖిల జగతి మూలం


Pournami : Pallakivai Song Lyrics (పల్లకివై ఓహో ఓహో)

చిత్రం: పౌర్ణమి (2006)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: గోపికా పూర్ణిమ

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్



పల్లవి :

తన్న నన్న నన్న నన్న పల్లకివై ఓహో ఓహో భారాన్ని మోయి ఓహో ఓహో పాదం నువై ఓహో ఓహో నడిపించావోయ్ ఓహో ఓహో అవ్వ బువ్వ కావాలోయ్ నువ్వే ఇవాళోయి రివ్వు రివ్వున ఎగిరాలయ్ గాలిలో తొక్కుడు బిళ్ళాటడాలోయ్ నీలాకాశంలో చుక్కల్లోకం చూడాలోయి చలో చలో చలో చలో ఓ ఓ ఓ ఓ చలో ఓ ఓ ఓ

చరణం:1 హే కలవరపరిచే కలవో శిలలను మరిచే కలవో అలజడి చేసే అలవో అలరించే అల్లరివో ఉడుపుగా చేసే వలవో నడివేసవిలో చలివో తెలియదు గ ఎవ్వరివో నాకెందుకు తగిలావో వోదలనౕంటావు ఒంటరిగా సరే పద మహాప్రభో నిదరలేపాక తుంటరిగా ఇటో అటో ఎటో దూసుకుపోవాలో పల్లకివై ఓహో ఓహో భారాన్ని మోయి ఓహో ఓహో

చరణం:2 చల్ చల్ చక చల్ చల్ చక చల్ చల్ చక చల్ చల్ చల్ చల్ చల్ చక చల్ చల్ చక చల్ చల్ చక చల్ చల్ చల్ హోయ్ జల జల జలపాతంలో జిలిబిలి చెలగాటంలో గలగలా గల సందడితో న అందెలు కట్టాలోయ్ చిలకల తల గీతౕం లో తొలి తొలి గిలి గింతలలో కిల కిల సవ్వడి తో కేరింతలు కొట్టాలి వరద గోదారి ఒరవడిలా శృతి లయ ఎలాగయో వయసు వయ్యారి లాహిరిలో దివి భువి ఇలా ఉయ్యాలూగాలోయ్ హుహుమ్ హుహుమ్ హుహుమ్ హుమ్ హుహుమ్ హుహుమ్ హుహుమ్ హుహుమ్

20, డిసెంబర్ 2021, సోమవారం

Pournami : Yevaro Choodali Song Lyrics (ఎవరో చూడాలి )

చిత్రం: పౌర్ణమి (2006)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: కె.ఎస్. చిత్ర

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్



పల్లవి :

ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి ఇటుగా సాగాలి అని యేరు ఎవరినడగాలి  కో అంటూ కబురు పెడితే రగిలే కొండ గాలి వు అంటూ తరలి రాదా నింగే పొంగి పొరలి .  ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి ఇటుగా సాగాలి అని యేరు ఎవరినడగాలి హో హో…

చరణం:1 తనలో చినుకే బరువై కారి మబ్బే వదిలిన చెరలో కునుకు కరువై కల వారమే తరిమిన  వనమే నన్ను తన వొడిలో అమ్మాయి పొదువుకున్నదని పసిపాపల్లె కొమ్మలలో ఉయ్యాలూపుతున్నాడని నెమ్మదిగా నా మది కి నమ్మకమందించేదెవరో.  ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి ఇటుగా సాగాలి అని యేరు ఎవరినడగాలి 

చరణం:2

హోం వరసే కలిపే చాణువై నను తడిమే పూలతో కనులే తుడిచే చెలిమై తల నిమిరి జాలితో ఎపుడో కన్నా తీపి కల ఎదురవుతుంటే దీపికాలు  శిలలో వున్నా శిల్ప కళా నడకే నేర్చుకున్నదిలా దుందుడుకు ముందడుగు సంగతి అడిగే వారెవరో


27, జూన్ 2021, ఆదివారం

Pournami : Bharatha Vedamuga Song Lyrics (భరత వేదముగ)

చిత్రం: పౌర్ణమి (2006)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: కె.ఎస్. చిత్ర

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్


పల్లవి :

శంభో శంకర హర హర మహాదేవ (4)

తద్ధింతాదిది ధింధిమీ పరుల తాండవకేళీతత్పర

గౌరీమంజుల సింజిణీ జతుల లాస్యవినోదవ శంకర


భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశ

శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదముపరేశ

నీలకందరా జాలిపొందరా కరుణతొ ననుగనరా

నీలకందరా శైలమందిరా మొరవిని బదులిడరా

నగజామనోజ జగదీశ్వరా మాలేందుశేఖరా శంకరా

భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశ

శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదముపరేశ

హర హర మహాదేవ (4)


చరణం:1

ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...

ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...

ఆ... అంతకాంత ఈ సతి అగ్నితప్తమైనది

మేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనదీ...

ఆదిశక్తి ఆకృతి అద్రిజాత పార్వతి

తాణువైన ప్రాణధవుని చెంతకు చేరుతున్నదీ...

ఆ... ఆ... భవుని భువికి తరలించేలా ధరణి దివిని తలపించేలా

రసతరంగిణీ లీల యతిని నృత్యరతుని చేయగలిగే ఈ... వేళ


భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశ

శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదముపరేశ


చరణం:2

జంగమ సావర గంగాచ్యుత శిర భృతమంజులకర పురహరా

భక్తశుభంకర భవనా శంకర స్వరహర దక్షాత్వర హరా

పాలవిలోచన పాలిత జనగణ కాల కాల విశ్వేశ్వర

ఆసుతోష అథనాశ విశాషణ జయగిరీశ బృహదీశ్వరా

హర హర మహాదేవ

హర హర మహాదేవ

వ్యోమకేశ నిను హిమగిరి వరసుత ప్రేమపాశమున పిలువంగా

యోగివేష నీ మనసున కలగద రాగలేశమైనా

హే మహేశ నీ భయదపదాహతి దైత్యశోషణము జరుపంగ

భోగిభూష భువనాళిని నిలుపవ అభయముద్రలోన

నమక చమకముల నాదాన యమక గమకముల యోగాన

పలుకుతున్న ప్రాణాన ప్రణవనాద ప్రథమనాథ శృతివినరా

హర హర మహాదేవ.....


22, జూన్ 2021, మంగళవారం

Pournami : Muvvala Navvakala Song Lyrics (మువ్వలా నవ్వకలా ముద్దమందారమా)

చిత్రం: పౌర్ణమి (2006)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్


పల్లవి :

మువ్వలా నవ్వకలా ముద్దమందారమా

ముగ్గులో దించకిలా ముగ్ధసింగారమా

నేలకే నాట్యం నేర్పావే నయగారమా

గాలికే సంకెళ్ళేశావే


నన్నిలా మార్చగల కళ నీ సొంతమా

ఇది నీ మాయ వల కాదని అనకుమా

ఆశకే ఆయువు పోశావే మధుమంత్రమే

రేయికే రంగులు పూశావే


చరణం:1

కలిసిన పరిచయం ఒకరోజే కదా

కలిగిన పరవశం యుగముల నాటిదా

కళ్ళతో చుసే నిజం నిజం కాదేమో

గుండెలో ఏదో ఇంకో సత్యం ఉందేమో


నన్నిలా మార్చగల కళ నీ సొంతమా

ఇది నీ మాయ వల కాదని అనకుమా

నేలకే నాట్యం నేర్పావే నయగారమా

గాలికే సంకెళ్ళేశావే


చరణం:2

పగిలిన బొమ్మగా మిగిలిన నా కథ

మరియొక జన్మగా మొదలౌతున్నదా

పూటకో పుట్టుక ఇచ్చే వరం ప్రేమేగా

మనలో నిత్యం నిలిచే ప్రాణం తనేగా


మువ్వలా నవ్వకలా ముద్దమందారమా

ముగ్గులో దించకిలా ముగ్ధసింగారమా

ఆశకే ఆయువు పోశావే మధుమంత్రమే

రేయికే రంగులు పూశావే