చిత్రం: ప్రేమ (1989)
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: ఇళయరాజా
పల్లవి :
ఓ ఓ ఓ... ఓ ఓ ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... ఓ ఓ ఓ ఓ ఓ... ఈనాడే ఏదో అయ్యిందీ... ఏనాడూ నాలో జరగందీ... ఈ అనుభవం మరలా రానిదీ... ఆనంద రాగం మోగిందీ... అందాల లోకం రమ్మందీ... ఈనాడే ఏదో అయ్యిందీ... ఏనాడూ నాలో జరగందీ... చరణం 1:
నింగీ నేలా ఏకం కాగా... ఈ క్షణమిలాగె ఆగిందీ నింగీ నేలా ఏకం కాగా... ఈ క్షణమిలాగె ఆగిందీ ఒకటే మాటన్నదీ... ఒకటై పొమ్మన్నదీ మనసే ఇమ్మన్నదీ... అదినా సొమ్మన్నదీ పరువాలు మీటి... న న న న న సెలయేటీ తోటి... న న న న న పాడాలీ నేడు... న న న న న కావాలీ తోడు... న న న న న న... న న న న న న న... ఈనాడే ఏదో అయ్యిందీ ... ఏనాడూ నాలో జరగందీ... చరణం 2:
సూర్యుని మాపీ చంద్రుని ఆపీ... వెన్నెల రోజంత కాసిందీ సూర్యుని మాపీ చంద్రుని ఆపీ.. వెన్నెల రోజంత కాసిందీ పగలూ రేయన్నదీ... అసలే లేదన్నదీ కలలే వద్దన్నదీ... నిజమే కమ్మన్నదీ ఎదలోనీ ఆశ... న న న న న ఎదగాలి బాసై... న న న న న కలవాలీ నీవు... న న న న న కరగాలీ నేను... న న న న న న... న న న న న న న... ఈనాడే ఏదో అయ్యిందీ... ఏనాడూ నాలో జరగందీ... ఈ అనుభవం మరలా రానిదీ... ఆనందరాగం మోగిందీ... అందాల లోకం రమ్మందీ ఈనాడే ఏదో అయ్యిందీ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి