Prema లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Prema లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, డిసెంబర్ 2021, ఆదివారం

Prema : You Are My Hero Song Lyrics

చిత్రం: ప్రేమ (1989)

సాహిత్యం: ఆత్రేయ

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఇళయరాజా




You Are My Hero Hero Hero

Yaa I Am Your Hero Hero Hero

You Are My Hero Hero Hero

I Am Your Hero Hero Hero

నా ఆశవు ఆశలో ఊహవో

ఊహల్లో ఊయల ఊగి పోదు హోం

You Are My Hero Hero Hero

Yaa I Am Your Hero Hero Hero


మెరుపై మెరిసితివి

మెలికలు తెలిపితివి 

నాలోని అందాలను

సరిగమలాలితివి

స్వరములు నేర్పితివి 

నాలోని రాగాలకు

పెదవులను విసిగించకు

హృదయమును అదిలించకు

దాసోహం నీ పొగరుకు

దండలు నీ వయసుకు

నా రాజు ఈ రోజు

నువ్వేలే నా రాజువు

You Are My Hero Hero Hero

I Am Your Hero Hero Hero

నా ఆశవు ఆశలో ఊహవో

ఊహల్లో ఊయల ఊగి పోదు హోం

You Are My Hero Hero Hero

Yaa I Am Your Hero Hero Hero


కన్నుల కుంచెలతో

కాలాలకు రంగులను 

వేశావు తొలిసారిగా

వెన్నెల నవ్వులతో

వెచ్చని కౌగిలిని

ఇచ్చావు మనసారగ

వలపులు తొలి విందుగా

జగతికిది కాను విందుగా

కలిసితిమి తొలి జంటగా

పలికెదము జేగంటగా

ఈ నాటికి ఏ నాటికి 

నువ్వేలే నా రాణివి


You Are My Hero Hero Hero

I Am Your Hero Hero Hero

You Are My Hero Hero Hero

Yaa I Am Your Hero Hero Hero

నా ఆశవు ఆశలో ఊహవో

ఊహల్లో ఊయల ఊగి పోదు హోం

You Are My Hero Hero Hero

I Am Your Hero Hero Hero

15, జూన్ 2021, మంగళవారం

Prema : Priyatama Naa Hrudayama (ప్రియతమా .. నా హృదయమా)

చిత్రం: ప్రేమ (1989)

సాహిత్యం: ఆత్రేయ

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఇళయరాజా



పల్లవి :

ప్రియతమా .. నా హృదయమా ప్రియతమా .. నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా ప్రేమకే ప్రతిరూపమా నా గుండెలో నిండిన గానమా .. నను మనిషిగా చేసిన త్యాగమా ! ప్రియతమా .. నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా ! చరణం:1
శిలలాంటి నాకు జీవాన్ని పోసి .. కలలాంటి బ్రతుకు కళతోటి నింపి వలపన్న తీపి తొలిసారి చూపి .. ఎదలోని సెగలు అడుగంట మాపి నులివెచ్చనైన ఓదార్పు నీవై .. శృతిలయ లాగ జతచేరినావు నువు లేని నన్ను ఊహించలేనూ .. నావేదనంతా నివేదించలేను అమరం అఖిలం మన ప్రేమా ! ప్రియతమా .. నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా ! చరణం:2 నీ పెదవి పైనా వెలుగారనీకు .. నీ కనులలోన తడి చేరనీకు నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు .. అది వెల్లువల్లే నను ముంచనీకు ఏ కారుమబ్బు ఎటు కమ్ముకున్నా .. మహా సాగరాలే నిను మింగుతున్నా ఈ జన్మలోనా ఎడబాటు లేదు..పది జన్మలైన ముడే వీడిపోదు అమరం అఖిలం మన ప్రేమా ! ప్రియతమా .. నా హృదయమా ప్రియతమా .. నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా ప్రేమకే ప్రతిరూపమా నా గుండెలో నిండిన గానమా .. నను మనిషిగా చేసిన త్యాగమా ! ప్రియతమా .. నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా

Prema : Eenade Yedho Ayyindi Song Lyrics (ఈనాడే ఏదో అయ్యిందీ)

చిత్రం: ప్రేమ (1989)

సాహిత్యం: ఆత్రేయ

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఇళయరాజా



పల్లవి :

ఓ ఓ ఓ... ఓ ఓ ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... ఓ ఓ ఓ ఓ ఓ... ఈనాడే ఏదో అయ్యిందీ... ఏనాడూ నాలో జరగందీ... ఈ అనుభవం మరలా రానిదీ... ఆనంద రాగం మోగిందీ... అందాల లోకం రమ్మందీ... ఈనాడే ఏదో అయ్యిందీ... ఏనాడూ నాలో జరగందీ... చరణం 1:

నింగీ నేలా ఏకం కాగా... ఈ క్షణమిలాగె ఆగిందీ నింగీ నేలా ఏకం కాగా... ఈ క్షణమిలాగె ఆగిందీ ఒకటే మాటన్నదీ... ఒకటై పొమ్మన్నదీ మనసే ఇమ్మన్నదీ... అదినా సొమ్మన్నదీ పరువాలు మీటి... న న న న న సెలయేటీ తోటి... న న న న న పాడాలీ నేడు... న న న న న కావాలీ తోడు... న న న న న న... న న న న న న న... ఈనాడే ఏదో అయ్యిందీ ... ఏనాడూ నాలో జరగందీ... చరణం 2:

సూర్యుని మాపీ చంద్రుని ఆపీ... వెన్నెల రోజంత కాసిందీ సూర్యుని మాపీ చంద్రుని ఆపీ.. వెన్నెల రోజంత కాసిందీ పగలూ రేయన్నదీ... అసలే లేదన్నదీ కలలే వద్దన్నదీ... నిజమే కమ్మన్నదీ ఎదలోనీ ఆశ... న న న న న ఎదగాలి బాసై... న న న న న కలవాలీ నీవు... న న న న న కరగాలీ నేను... న న న న న న... న న న న న న న... ఈనాడే ఏదో అయ్యిందీ... ఏనాడూ నాలో జరగందీ... ఈ అనుభవం మరలా రానిదీ... ఆనందరాగం మోగిందీ... అందాల లోకం రమ్మందీ ఈనాడే ఏదో అయ్యిందీ...

Prema : Ivvu Ivvu Oka Mudhu song lyrics (ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు)

చిత్రం: ప్రేమ (1989)

సాహిత్యం: ఆత్రేయ

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఇళయరాజా



పల్లవి :

ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు ఇవ్వలేంది అడగవద్దు ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు ఇవ్వలేంది అడగవద్దు వద్దు వద్దు అంటూ పోతే చిన్నదానా ఎప్పుడంట ఇచ్చేదంటా కన్నెముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడా పెళ్లిదాకా ఆగవంటా కళ్ళతోటే పెళ్లయింది చాల్లే ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు ఇవ్వలేంది అడగవద్దు ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు ఇవ్వలేంది అడగవద్దు చరణం:1

ఆద్యంతమూ లేని అమరానందమే ప్రేమ ఏ బంధమూ లేని తొలి సంబంధమే ప్రేమ ప్రేమ దివ్యభావము ప్రేమ దైవరూపము ప్రేమ జీవరాగము ప్రేమ జ్ఞానయోగము మనసున పారే సెలయేరు ప్రేమ అలసట తీర్చే చిరుగాలి ప్రేమ హద్దులేవీ లేనిది అందమైన ప్రేమ ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు ఇవ్వలేంది అడగవద్దు వద్దు వద్దు అంటూ పోతే చిన్నదానా ఎప్పుడంట ఇచ్చేదంటా కన్నెముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడా పెళ్లిదాకా ఆగవంటా కళ్ళతోటే పెళ్లయింది చాల్లే ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు ఇవ్వలేంది అడగవద్దు ఇవ్వు ఇవ్వు ఆహాహాహా.... ఒక్క ముద్దు ఊహూహూహూ.... చరణం:2

ఓ అల్లరి ప్రేమ ఇక ఆడించకు నన్ను ఓ టక్కరి ప్రేమ ఇక లాలించకు నన్ను నీకు నేను సొంతము నాకు నీవు సర్వము నీవు నాకు దేహము నేను నీకు ప్రాణము ప్రతిరోజు నీ ఉదయాన్ని నేను ప్రతిరేయి నీ నెలవంక నేను జన్మలెన్ని మారినా ప్రేమ పేరు ప్రేమే ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు ఇవ్వలేంది అడగవద్దు వద్దు వద్దు అంటూ పోతే చిన్నదానా ఎప్పుడంట ఇచ్చేదంటా కన్నెముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడా పెళ్లిదాకా ఆగవంటా కళ్ళతోటే పెళ్లయింది చాల్లే ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు ఇవ్వలేంది అడగవద్దు ఇవ్వు ఇవ్వు ఆహాహాహా..... ఒక్క ముద్దు ఊహూహూహూ.....