15, జూన్ 2021, మంగళవారం

Prema : Priyatama Naa Hrudayama (ప్రియతమా .. నా హృదయమా)

చిత్రం: ప్రేమ (1989)

సాహిత్యం: ఆత్రేయ

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఇళయరాజా



పల్లవి :

ప్రియతమా .. నా హృదయమా ప్రియతమా .. నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా ప్రేమకే ప్రతిరూపమా నా గుండెలో నిండిన గానమా .. నను మనిషిగా చేసిన త్యాగమా ! ప్రియతమా .. నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా ! చరణం:1
శిలలాంటి నాకు జీవాన్ని పోసి .. కలలాంటి బ్రతుకు కళతోటి నింపి వలపన్న తీపి తొలిసారి చూపి .. ఎదలోని సెగలు అడుగంట మాపి నులివెచ్చనైన ఓదార్పు నీవై .. శృతిలయ లాగ జతచేరినావు నువు లేని నన్ను ఊహించలేనూ .. నావేదనంతా నివేదించలేను అమరం అఖిలం మన ప్రేమా ! ప్రియతమా .. నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా ! చరణం:2 నీ పెదవి పైనా వెలుగారనీకు .. నీ కనులలోన తడి చేరనీకు నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు .. అది వెల్లువల్లే నను ముంచనీకు ఏ కారుమబ్బు ఎటు కమ్ముకున్నా .. మహా సాగరాలే నిను మింగుతున్నా ఈ జన్మలోనా ఎడబాటు లేదు..పది జన్మలైన ముడే వీడిపోదు అమరం అఖిలం మన ప్రేమా ! ప్రియతమా .. నా హృదయమా ప్రియతమా .. నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా ప్రేమకే ప్రతిరూపమా నా గుండెలో నిండిన గానమా .. నను మనిషిగా చేసిన త్యాగమా ! ప్రియతమా .. నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి