చిత్రం: రాజా
సంగీతం: S.A.రాజ్ కుమార్
గానం: బాలసుబ్రహ్మణ్యం
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
ఏదో ఒక రాగం పిలిచిందీవేళ
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా
ఏదో ఒక రాగం పిలిచిందీవేళ
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా
నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా
నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా..
జ్ఞాపకాలె మైమరపు జ్ఞాపకాలె మేల్కొలుపు
జ్ఞాపకాలె నిట్టూర్పు జ్ఞాపకాలె ఓదార్పు
ఏదో ఒక రాగం పిలిచిందీవేళ
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా
వీచే గాలులలో నీ ఊసులు జ్ఞాపకమే
పూచే పువ్వులలో నీ నవ్వులు జ్ఞాపకమే
తూరుపు కాంతుల ప్రతికిరణం నీ కుంకుమ జ్ఞాపకమే
తులసిమొక్కలో నీ సిరుల జ్ఞాపకం
చిలక ముక్కులా నీ అలక జ్ఞాపకం
ఏదో ఒక రాగం పిలిచిందీవేళ
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా
మెరిసే తారలలో నీ చూపులు జ్ఞాపకమే
యెగసే ప్రతి అలలో నీ ఆశలు జ్ఞాపకమే
కోవెలలోని దీపంలా నీ రూపం జ్ఞాపకమే
పెదవిపైన నీ పేరే చిలిపి జ్ఞాపకం
మరపురాని నీ ప్రేమే మధుర జ్ఞాపకం
ఏదో ఒక రాగం పిలిచిందీవేళ
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా
నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా
నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా..
జ్ఞాపకాలె మైమరపు జ్ఞాపకాలె మేల్కొలుపు
జ్ఞాపకాలె నిట్టూర్పు జ్ఞాపకాలె ఓదార్పు
ఏదో ఒక రాగం పిలిచిందీవేళ
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి