6, జూన్ 2021, ఆదివారం

Raaja : Mallela Vaana Song Lyrics (మల్లెల వాన మల్లెల వాన నాలోనా)

 

చిత్రం: రాజా

సంగీతం: S.A.రాజ్ కుమార్

గానం: మనో, చిత్ర

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి


మల్లెల వాన మల్లెల వాన నాలోనా మనసంతా మధుమాసంలా విరబూసేనా మల్లెల వాన మల్లెల వాన నాలోనా మనసంతా మధుమాసంలా విరబూసేనా మనసంతా మధుమాసంలా విరబూసేనా కోయిల సంగీతంలా కిలకిలలే వినిపించేనా తేనేల జలపాతంలా సరదాలే చెలరేగేనా విరిసే అరవిందాలే అనిపించేనా మైమరచే ఆనందాలే ప్రతి నిమిషానా మల్లెల వాన మల్లెల వాన నాలోనా మనసంతా మధుమాసంలా విరబూసేనా చిన్న చిన్న సంగతులే సన్న జాజి విరిజల్లు తుళ్ళుతున్న అల్లరులే ముల్లు లేని రోజాలు అందమైన ఆశలే చిందులాడు ఊహలే నందనాల పొదరిల్లు గుప్పెడంత గుండెలొ గుప్పుమన్న ఊసులే చందనాలు వెదజల్లు ఓ.... వన్నెల పరవళ్ళు పున్నాగ పరిమళాలు వయసే తొలి చైత్రం చూసే సమయాన మైమరచే ఆనందాలే ప్రతి నిమిషాన మల్లెల వాన మల్లెల వాన నాలోనా మనసంతా మధుమాసంలా విరబూసేనా కొమ్మ లేని కుసుమాలు కళ్ళలోని స్వప్నాలు మొగలిపూల గంధాలు మొదలయ్యేటి బంధాలు కోరుకున్న వారిపై వాలుతున్న చూపులే పారిజాత హారాలు ముద్దు గుమ్మ ఎదలో మొగ్గ విచ్చు కధలే ముద్దమందారాలు ఆ.... నిత్య వసంతాలు ఈ పులకింతల పూలు ఎపుడు వసివాడని వరమై హృదయాన మైమరచే ఆనందాలే ప్రతి నిమిషాన మల్లెల వాన మల్లెల వాన నాలోనా మనసంతా మధుమాసంలా విరబూసేనా.. మనసంతా మధుమాసంలా విరబూసేనా.. కోయిల సంగీతంలా కిలకిలలే వినిపించేనా తేనేల జలపాతంలా సరదాలే చెలరేగేనా విరిసే అరవిందాలే అనిపించేనా మైమరచే ఆనందాలే ప్రతి నిమిషానా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి