Raaja లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Raaja లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, జూన్ 2021, ఆదివారం

Raaja : Kannula Logililo (కన్నుల లోగిలిలో వెన్నెల విరిసిందీ)

 

చిత్రం: రాజా

సంగీతం: S.A.రాజ్ కుమార్

గానం: ఉన్ని కృష్ణన్,, చిత్ర

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి 


అ..ఆ లాలల లాలల లా...లాలల లాలల లా కన్నుల లోగిలిలో వెన్నెల విరిసిందీ చల్లని జాబిలితో స్నేహం కుదిరిందీ చెలిమి తోడుంటె చాలమ్మ లేనిది ఏముంది అశ చిటికేస్తె చాలమ్మా అందనిదేముందీ కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది చల్లని జాబిలితో స్నేహం కుదిరింది గున్నమామి గొంతులో తేనెతీపి నింపుతూ కోయిలమ్మ చేరుకున్నది ఎండమావి దారిలో పంచదారవాగులా కొత్తపాట సాగుతున్నది ఒంటరైన గుండెల్లో ఆనందాల అందెలతో అడే సందడిదీ అల్లిబిల్లి కాంతులతో ఏకాంతాల చీకటినీ తరిమి బంధమిదీ కల చెరగని కలలను చూడూ కంటికి కావాలి నేనుంటా కల తరగని వెలుగులు నేడూ ఇంటీకి తోరణమనుకుంటా కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది చల్లని జాబిలితో స్నేహం కుదిరింది పంచుకున్న ఊసులూ పెంచుకున్న ఆశలూ తుళ్ళి తుళ్ళి ఆడుతున్నవి కంచెలేని ఊహలే పంచవన్నె గువ్వలై నింగి అంచు తాకుతున్నవి కొత్తజల్లు కురిసిందీ బ్రతుకే చిగురు తొడిగేలా వరమై ఈవేళా వాన విల్లు విరిసిందీ మిన్నూ మన్ను కలిసేలా ఎగసే ఈ వేళా అణువణువును తడిపిన ఈతడి అమృతవర్షిణి అనుకోనా అడుగడుగున పచ్చని బాటని బాటాలు పరిచిన వనమును చూస్తున్నా కన్నుల లోగిలిలో వెన్నెల విరిసిందీ చల్లని జాబిలితో స్నేహం కుదిరింది చెలిమి తోడుంటె చాలమ్మ లేనిది ఏముంది అశ చిటికేస్తె చాలమ్మా అందనిదేముందీ

Raaja : Mallela Vaana Song Lyrics (మల్లెల వాన మల్లెల వాన నాలోనా)

 

చిత్రం: రాజా

సంగీతం: S.A.రాజ్ కుమార్

గానం: మనో, చిత్ర

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి


మల్లెల వాన మల్లెల వాన నాలోనా మనసంతా మధుమాసంలా విరబూసేనా మల్లెల వాన మల్లెల వాన నాలోనా మనసంతా మధుమాసంలా విరబూసేనా మనసంతా మధుమాసంలా విరబూసేనా కోయిల సంగీతంలా కిలకిలలే వినిపించేనా తేనేల జలపాతంలా సరదాలే చెలరేగేనా విరిసే అరవిందాలే అనిపించేనా మైమరచే ఆనందాలే ప్రతి నిమిషానా మల్లెల వాన మల్లెల వాన నాలోనా మనసంతా మధుమాసంలా విరబూసేనా చిన్న చిన్న సంగతులే సన్న జాజి విరిజల్లు తుళ్ళుతున్న అల్లరులే ముల్లు లేని రోజాలు అందమైన ఆశలే చిందులాడు ఊహలే నందనాల పొదరిల్లు గుప్పెడంత గుండెలొ గుప్పుమన్న ఊసులే చందనాలు వెదజల్లు ఓ.... వన్నెల పరవళ్ళు పున్నాగ పరిమళాలు వయసే తొలి చైత్రం చూసే సమయాన మైమరచే ఆనందాలే ప్రతి నిమిషాన మల్లెల వాన మల్లెల వాన నాలోనా మనసంతా మధుమాసంలా విరబూసేనా కొమ్మ లేని కుసుమాలు కళ్ళలోని స్వప్నాలు మొగలిపూల గంధాలు మొదలయ్యేటి బంధాలు కోరుకున్న వారిపై వాలుతున్న చూపులే పారిజాత హారాలు ముద్దు గుమ్మ ఎదలో మొగ్గ విచ్చు కధలే ముద్దమందారాలు ఆ.... నిత్య వసంతాలు ఈ పులకింతల పూలు ఎపుడు వసివాడని వరమై హృదయాన మైమరచే ఆనందాలే ప్రతి నిమిషాన మల్లెల వాన మల్లెల వాన నాలోనా మనసంతా మధుమాసంలా విరబూసేనా.. మనసంతా మధుమాసంలా విరబూసేనా.. కోయిల సంగీతంలా కిలకిలలే వినిపించేనా తేనేల జలపాతంలా సరదాలే చెలరేగేనా విరిసే అరవిందాలే అనిపించేనా మైమరచే ఆనందాలే ప్రతి నిమిషానా

Raaja : Edo Oka Raagam Song Lyrics (ఏదో ఒక రాగం పిలిచిందీవేళ)

 

చిత్రం: రాజా

సంగీతం: S.A.రాజ్ కుమార్

గానం: బాలసుబ్రహ్మణ్యం

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి


ఏదో ఒక రాగం పిలిచిందీవేళ

ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా


ఏదో ఒక రాగం పిలిచిందీవేళ

ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా

నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా 

నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా..

జ్ఞాపకాలె మైమరపు జ్ఞాపకాలె మేల్కొలుపు

జ్ఞాపకాలె నిట్టూర్పు జ్ఞాపకాలె ఓదార్పు 

ఏదో ఒక రాగం పిలిచిందీవేళ

ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా


వీచే గాలులలో నీ ఊసులు జ్ఞాపకమే

పూచే పువ్వులలో నీ నవ్వులు జ్ఞాపకమే

తూరుపు కాంతుల ప్రతికిరణం నీ కుంకుమ జ్ఞాపకమే

తులసిమొక్కలో నీ సిరుల జ్ఞాపకం

చిలక ముక్కులా నీ అలక జ్ఞాపకం

ఏదో ఒక రాగం పిలిచిందీవేళ

ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా 


మెరిసే తారలలో నీ చూపులు జ్ఞాపకమే

యెగసే ప్రతి అలలో నీ ఆశలు జ్ఞాపకమే

కోవెలలోని దీపంలా నీ రూపం జ్ఞాపకమే

పెదవిపైన నీ పేరే చిలిపి జ్ఞాపకం

మరపురాని నీ ప్రేమే మధుర జ్ఞాపకం 

ఏదో ఒక రాగం పిలిచిందీవేళ

ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా

నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా 

నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా..

జ్ఞాపకాలె మైమరపు జ్ఞాపకాలె మేల్కొలుపు

జ్ఞాపకాలె నిట్టూర్పు జ్ఞాపకాలె ఓదార్పు 

ఏదో ఒక రాగం పిలిచిందీవేళ

ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా 

5, జూన్ 2021, శనివారం

Raaja : Kavvinchake O Prema Song Lyrics (కవ్వించకే ఓ ప్రేమా కౌగిళ్ళకే రావమ్మా)

 

చిత్రం: రాజా

సంగీతం: S.A.రాజ్ కుమార్

గానం: రాజేష్ కృష్ణన్,సుజాత మోహన్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి



కవ్వించకే ఓ ప్రేమా కౌగిళ్ళకే రావమ్మా చల్లనైన ఓ ప్రేమా చందమామలా రామ్మా తీయనైన ఓ ప్రేమా తేనెవానలా రామ్మా ఎదలో ఊయలూగుమా హాయిరాగమా వేయి కలల చిరునామా ప్రేమా స్వాతి చినుకులా సందెవెలుగులా కొత్త వరదలా రామ్మా ప్రేమా కవ్వించకే ఓ ప్రేమా కౌగిళ్ళకే రావమ్మా అందమైన బంధనాల వరమా బందనాల చందనాలు గొనుమా కలే తీరుగా ఒడే చేరుమా సున్నితాల కన్నె లేత నడుమా కన్నుతోనే నిన్ను కాస్త తడిమా ఇదే తీరుగా ఎదే మీటుమా సాయం కావాలన్నదీ తాయం ఓ ప్రేమా చేయందిస్తా రామరి సరదా పడదామా నీవెంటే నీడై వుంటా నిత్యం ఓ ప్రేమా కవ్వించకే ఓ ప్రేమా కౌగిళ్ళకే రావమ్మా వేడుకైన ఆడ ఈడు వనమా వేడివేడి వేడుకోలు వినుమా వయ్యారాలలో విడిది చూపుమా అగలేని ఆకతాయి తనమా వేగుతున్న వేగమాప తరమా  సుతారాలతో జతై చేరుమా తీరం చేరుస్తున్నదీ నీ నవ్వేనమ్మా భారం తీరుస్తున్నదీ నువ్వే లేవమ్మ నాప్రాణం నీవే అంటే నమ్మాలే ప్రేమా కవ్వించకే ఓ ప్రేమా కౌగిళ్ళకే రావమ్మా చల్లనైన ఓ ప్రేమా చందమామలా రామ్మా తియనైన ఓ ప్రేమా తేనెవానలా రమ్మా ఎదలో ఊయలూగుమా హాయిరాగమా వేయి కలల చిరునామా ప్రేమా స్వతి చినుకులా సందెవెలుగులా కోత్త వరదలా రామ్మా ప్రేమా స్వాతి చినుకులా సందెవెలుగులా కొత్త వరదలా రామ్మా ప్రేమా