చిత్రం: శుభలగ్నం (1994)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం: ఎస్. వి. కృష్ణారెడ్డి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
చిలక ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక
మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేయి జారాక
లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక
చిలక ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక
గోరింక ఎదే చిలక లేదింక
గోరింక ఎదే చిలక లేదింక
బ్రతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావే
బ్రతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావే
వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే
అమృతమే చెల్లించి ఆ విలువతో
హలాహలం కొన్నావే అతి తెలివితో
కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరు పేదైనావే
కొండంత అండే నీకు లేదింక
కొండంత అండే నీకు లేదింక
అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో
మమకారం విలువెంతో మరిచావా సిరి మైకంలో
ఆనందం కొనలేని ధన రాశితో
అనాధలా మిగిలావే అమవాసలో
తీరా నువు కను తెరిచాక తీరం కనపడదే యింక
చిలక ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక
మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేయి జారాక
లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక
చిలక ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి