చిత్రం: సుందరకాండ (1992)
రచన: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
కోకిలమ్మ కొత్త పాట పాడింది కూనలమ్మ కూచిపూడి ఆడింది సందె పొద్దు నీడ అందగత్తె కాడ సన్నజాజి ఈల వేయగా అరె మావ ఇల్లలికి పండగ చేసుకుందామ ఓసి భామ బుగ్గలతో బూరెలు వండుకుందామ అరె మావ ఇల్లలికి పండగ చేసుకుందామ ఓసి భామ బుగ్గలతో బూరెలు వండుకుందామ పక్క పాపిడెందుకో పైట దూకుడెందుకే మగడా ఎడ పెడ గడె పడగానే అరె మావ ఇల్లలికి పండగ చేసుకుందామ ఓసి భామ బుగ్గలతో బూరెలు వండుకుందామ
పూల చెట్టు గోలపెట్టు తేనె పట్టులో నీ గుట్టు తీపిగున్నదీ పైట గొప్పు బయట పెట్టు చేతి పట్టు నీ కట్టు జారుతున్నదీ కొత్త గుట్టు కొల్ల గొట్టు కోకోనట్లో రాబట్టు కొబ్బరున్నదీ దాచి పెట్టు దోచి పెట్టు చాకులెట్టులో బొబ్బట్టు మోతగున్నదీ బుగ్గలు మొగ్గలై నువ్వు దగ్గరైతే విచ్చుకుంటనయ్యో నచ్చినా గిచ్చినా నువ్వు ఇచ్చుకుంటే పుచ్చుకుంటనమ్మో వరసే నీలో కలు కోలో అనగానే అరె మావ ఇల్లలికి పండగ చేసుకుందామ ఓసి భామ బుగ్గలతో బూరెలు వండుకుందామ
కన్ను కొట్టు రెచ్చ గొట్టు కాక పట్టులో కాల్ షీట్ నైట్ కున్నదీ పాలు పట్టు పండ బెట్టు పాని పట్టులో బెడ్ షీట్ బెంగపడ్డదీ బెడ్డు లైటు తీసి కట్టు గుడ్డు నైట్ లో కుర్ర ఈడు కుంపటైనదీ ఉట్టి కొట్టు చట్టి పట్టు జాకు పాటు లో ఆటు పోటు అక్కడున్నదీ ఒంపులో సొంపులో నిన్ను బొత్తుకుంటే మొత్తుకుంటవమ్మో చెప్పినా చేసినా నీది కాని నాడు ఎక్కడుంటవయ్యో అసలే చెలి ఆనార్కలి అనగానే
అరె మావ ఇల్లలికి పండగ చేసుకుందామ ఓసి భామ బుగ్గలతో బూరెలు వండుకుందామ పక్క పాపిడెందుకో పైట దూకుడెందుకే మగడా ఎడ పెడ గడె పడగానే అరె మావ ఇల్లలికి పండగ చేసుకుందామ ఓసోసి భామ బుగ్గలతో బూరెలు వండుకుందామ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి