4, జూన్ 2021, శుక్రవారం

Sundarakanda : Ulikipadaku song lyrics (ఉలికిపడకు కుకుకుకు)

చిత్రం: సుందరకాండ (1992)

రచన: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి


పల్లవి: ఉలికిపడకు కుకుకుకు పెదవి కలిపేందుకు కుకుకుకు కలలు కనకు కుకుకుకు కథలు నడిపేందుకు కుకుకు చిలక పలికిన వయసుకు వయసు తొడిగిన సొగసుకు షరాలు పెంచకు... కుకుకుకుకు ఉలికిపడకు కుకుకుకు పెదవి కలిపేందుకు కుకుకుకు కలలు కనకు కుకుకుకు చరణం:1 మొగ్గ విచ్చే వేళ నా మోజులన్నీ పోటు తుమ్మెదల్లే తేనె విందుకొస్తావా సిగ్గులొచ్చే వేళ నే దగ్గరైతే పాలబుగ్గలోనే ఎర్రపొంగులిస్తావా మత్తుగ మల్లెలు అత్తరు చిందేవేళ చంపకమాలలు సొంపులకిస్తావా పైటల చాటుల పద్యము రాసేవేళ ఉత్పలమాలలకూపిరి పోస్తావా నీవడిగే దోపిడిలో... నీ ఒడిలో ఒత్తిడిలో వసంతవేళకు... కుకుకుకుకు ఉలికిపడకు కుకుకుకు పెదవి కలిపేందుకు కుకుకుకు కలలు కనకు కుకుకుకు చరణం:2 ఆడదయ్యే వేళ నీ అందమంతా ఎండ కన్నుదాటి గుండెలోకి వస్తావా పాయసాలు పొంగే నీ పక్కకొస్తే ముద్దు బారసాల ముందుగానే చేస్తావా నన్నయభట్టుకు నవలలు నచ్చే వేళ కౌగిలి పర్వం కొత్తగ రాస్తావా చక్కిలిగింతలు తిక్కనకొచ్చిన వేళ నర్తనశాలకు నాతో వస్తావా నా ఎదలో పూపొదలో నా కథలో నీ జతలో సందేహమెందుకు కుకు కుకుకుకుకు ఉలికిపడకు కుకుకుకు పెదవి కలిపేందుకు కుకుకుకు కలలు కనకు కుకుకుకు కథలు నడిపేందుకు కుకుకు చిలక పలికిన వయసుకు వయసు తొడిగిన సొగసుకు షరాలు పెంచకు... కుకుకుకుకు ఉలికిపడకు కుకుకుకు పెదవి కలిపేందుకు కుకుకుకు కలలు కనకు కుకుకుకు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి