Sundarakanda లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Sundarakanda లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, మే 2022, శుక్రవారం

Sundarakanda : Sundara Kandaka Oo Song Lyrics (సుందరాకాండకు)

చిత్రం: సుందరకాండ (1992)

రచన: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి




సుందరాకాండకు ఓహ్ ఓహ్ సందడే సందడి...ఓహ్....ఓ అందుకే be ready ఓహ్....ఓ

welcome.. jakson steps కు ఓహ్....ఓ laughter lips కు ఓహ్....ఓ jollyday pops కు ఓహ్....ఓ come... come... సతమర్కటం పితలాటకం బ్రహ్మచారులు బ్రతుకే సుఖం

సుబ్బరాజు ..... వచ్చాను సర్ ఇబ్రహీం...ఇక్కడున్న అశోకుడు చెట్లు నాటించెను మననవ్వులే అవి పూయించేను

వనజ...వెచ్చగా పాకీజా...ఐహో మహాటందు ఫ్రీడంఇప్పించెను మానపగ్గాలనే అది తెంచేశాను అర్ నిన్నటి లెక్చర్ సినిమాస్కోపేలా పిక్చర్ కావాలి అది ఆంధ్ర సీడెడ్ నిజాం ఎరుగని సిక్సతురే కొట్టాలి ఇదెరా ఖుషిల మాజాల కిష్కిందకాండ  సతమర్కటం పితలాటకం బ్రహ్మచారులు బ్రతుకే సుఖం సుందరాకాండకు ఓహ్ ఓహ్ సందడే సందడి...ఓహ్....ఓ అందుకే be ready ఓహ్....ఓ welcome.. MVS..Yes Sir SVR... హ్హ నేనె సిరు గులాం అలీ ఘజల్ పదవోయ్ కథాకళి కసిగా పదవోయ్ సక్కుబాయి..సామిరంగా సత్యభామ..అమ్మదొంగా రాగిఇంగ్ లో రంభ ఏమన్నదోయి జగ్గిన్గ్లో జత నెన్నంన్దోయ్ అది నిరాలాడిన సూపర్ హిట్టర్ సెక్సీ థ్రిల్లేర్లులే అర్ మచిలీపతంపు మతిని ఆటకు బాక్సులు నిండేనులే ఇదేరే హమేషా తమాషా కాలేజీ కంద  సతమర్కటం పితలాటకం బ్రహ్మచారులు బ్రతుకే సుఖం సుందరాకాండకు ఓహ్ ఓహ్ సందడే సందడి...ఓహ్....ఓ అందుకే be ready ఓహ్....ఓ  welcome.. సతమర్కటం పితలాటకం బ్రహ్మచారులు బ్రతుకే సుఖం

1, ఆగస్టు 2021, ఆదివారం

Sundarakanda : Navvave Nava Mallika Song Lyrics (ఆకాశాన సూర్యుడుండడు)

చిత్రం: సుందరకాండ (1992)

రచన: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



ఆకాశాన సూర్యుడుండడు సందెవేళకే చందమామకి రూపముండదు తెల్లవారితే ఈ మజిలీ.. మూడునాళ్ళే.. ఈ జీవయాత్రలో ఒక పూటలోనే రాలు పూవులెన్నో నవ్వవే నవమల్లిక.. ఆశలే అందాలుగా ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలే ఇక రోజాలా కన్నీటిమీద నావ సాగనేల నవ్వవే నవమల్లిక.. ఆశలే అందాలుగా * కొమ్మలు రెమ్మలు గొంతేవిప్పిన కొత్తపూల మధుమాసంలో తుమ్మెద జన్మకు నూరేళ్ళెందుకు రోజే చాలులే చింతపడే చిలిపి చిలకా... చిత్రములే బ్రతుకు నడకా పుట్టే ప్రతి మనిషీ కనుమూసే తీరు మళ్ళీ తన మనిషై ఒడిలోకే చేరు మమతానురాగ స్వాగతాలు పాడ నవ్వవే నవమల్లిక.. ఆశలే అందాలుగా *ముల్లును పువ్వుగ బాధను నవ్వుగ మార్చుకున్న ఈ రోజాకి జన్మ బంధము ప్రేమ గంధము పూటే చాలులే పంజరమై బ్రతుకు మిగులు.. పావురమే బైటికెగురు మైనా క్షణమైనా పలికిందే భాష ఉన్నా కలగన్నా విడిపోదీ ఆశ విధిరాత కన్న లేదు వింత పాట నవ్వవే నవమల్లిక.. ఆశలే అందాలుగా ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలే ఇక రోజాలా కన్నీటిమీద నావ సాగనేల నవ్వవే నవమల్లిక.. ఆశలే అందాలుగా

4, జూన్ 2021, శుక్రవారం

Sundarakanda : Inka Inka Song Lyrics (ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇవ్వాలేదొ అచ్చాగా)

చిత్రం: సుందరకాండ (1992)

రచన: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి


ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇవ్వాలేదొ అచ్చాగా అవ్వా బువ్వా గువ్వా గవ్వా అన్ని నీకే ఇచ్చాగా వయసుకే రాతిరి వలపుల చాకిరి పెదవి చిలకే పెదవి కొరికే మల్లెలు వీచిన మన్మధ ఉప్పెనలా ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇవ్వాలేదొ అచ్చాగా అవ్వా బువ్వా గువ్వా గవ్వా అన్ని నీకే ఇచ్చాగా నిన్ను చూస్తు కూర్చుంటే ... ముద్దొస్తుంటే... నిద్దారాగి పొతుంటే.... నీతోడుంటే.... తెల్లా తెల్లారినాక తేనే వెక్కిళ్ళు రాగా చలి గాలి ఒడి కొట్టే చెలి ఒళ్ళొ పడగొట్టే వింత చదువుకుంట తెలుసుకుంట కొత్తగా... ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇవ్వాలేదొ అచ్చాగా అవ్వా బువ్వా గువ్వా గవ్వా అన్ని నీకే ఇచ్చాగా మల్లె పూల పక్కల్లొ ..... ఈ ఉక్కల్లొ... పిల్లవాడి టెక్కుల్లొ.... రేతిక్కల్లొ.... పైలా పచ్చీసు వయసే లైలా కౌగిళ్ళు తెరిచే నడుమేదొ అడిగింది తడిమేస్తే కరిగింది బుగ్గ ఎరుపు మొగ్గ చిలిపి సిగ్గె తీరగ ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇవ్వాలేదొ అచ్చాగా అవ్వా బువ్వా గువ్వా గవ్వా అన్ని నీకే ఇచ్చాగా వయసుకే రాతిరి వలపులా చాకిరి పెదవి చిలకే పెదవి కొరికే మల్లెలు వీచిన మన్మధ ఉప్పెనలొ ఇంకా ఇంకా

Sundarakanda Songs : Kokilamma Kotha Pata (కోకిలమ్మ కొత్త పాట పాడింది)

చిత్రం: సుందరకాండ (1992)

రచన: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి


కోకిలమ్మ కొత్త పాట పాడింది కూనలమ్మ కూచిపూడి ఆడింది సందె పొద్దు నీడ అందగత్తె కాడ సన్నజాజి ఈల వేయగా అరె మావ ఇల్లలికి పండగ చేసుకుందామ ఓసి భామ బుగ్గలతో బూరెలు వండుకుందామ అరె మావ ఇల్లలికి పండగ చేసుకుందామ ఓసి భామ బుగ్గలతో బూరెలు వండుకుందామ పక్క పాపిడెందుకో పైట దూకుడెందుకే మగడా ఎడ పెడ గడె పడగానే అరె మావ ఇల్లలికి పండగ చేసుకుందామ ఓసి భామ బుగ్గలతో బూరెలు వండుకుందామ

పూల చెట్టు గోలపెట్టు తేనె పట్టులో నీ గుట్టు తీపిగున్నదీ పైట గొప్పు బయట పెట్టు చేతి పట్టు నీ కట్టు జారుతున్నదీ కొత్త గుట్టు కొల్ల గొట్టు కోకోనట్లో రాబట్టు కొబ్బరున్నదీ దాచి పెట్టు దోచి పెట్టు చాకులెట్టులో బొబ్బట్టు మోతగున్నదీ బుగ్గలు మొగ్గలై నువ్వు దగ్గరైతే విచ్చుకుంటనయ్యో నచ్చినా గిచ్చినా నువ్వు ఇచ్చుకుంటే పుచ్చుకుంటనమ్మో వరసే నీలో కలు కోలో అనగానే అరె మావ ఇల్లలికి పండగ చేసుకుందామ ఓసి భామ బుగ్గలతో బూరెలు వండుకుందామ

కన్ను కొట్టు రెచ్చ గొట్టు కాక పట్టులో కాల్ షీట్ నైట్ కున్నదీ పాలు పట్టు పండ బెట్టు పాని పట్టులో బెడ్ షీట్ బెంగపడ్డదీ బెడ్డు లైటు తీసి కట్టు గుడ్డు నైట్ లో కుర్ర ఈడు కుంపటైనదీ ఉట్టి కొట్టు చట్టి పట్టు జాకు పాటు లో ఆటు పోటు అక్కడున్నదీ ఒంపులో సొంపులో నిన్ను బొత్తుకుంటే మొత్తుకుంటవమ్మో చెప్పినా చేసినా నీది కాని నాడు ఎక్కడుంటవయ్యో అసలే చెలి ఆనార్కలి అనగానే

అరె మావ ఇల్లలికి పండగ చేసుకుందామ ఓసి భామ బుగ్గలతో బూరెలు వండుకుందామ పక్క పాపిడెందుకో పైట దూకుడెందుకే మగడా ఎడ పెడ గడె పడగానే అరె మావ ఇల్లలికి పండగ చేసుకుందామ ఓసోసి భామ బుగ్గలతో బూరెలు వండుకుందామ

Sundarakanda : Ulikipadaku song lyrics (ఉలికిపడకు కుకుకుకు)

చిత్రం: సుందరకాండ (1992)

రచన: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి


పల్లవి: ఉలికిపడకు కుకుకుకు పెదవి కలిపేందుకు కుకుకుకు కలలు కనకు కుకుకుకు కథలు నడిపేందుకు కుకుకు చిలక పలికిన వయసుకు వయసు తొడిగిన సొగసుకు షరాలు పెంచకు... కుకుకుకుకు ఉలికిపడకు కుకుకుకు పెదవి కలిపేందుకు కుకుకుకు కలలు కనకు కుకుకుకు చరణం:1 మొగ్గ విచ్చే వేళ నా మోజులన్నీ పోటు తుమ్మెదల్లే తేనె విందుకొస్తావా సిగ్గులొచ్చే వేళ నే దగ్గరైతే పాలబుగ్గలోనే ఎర్రపొంగులిస్తావా మత్తుగ మల్లెలు అత్తరు చిందేవేళ చంపకమాలలు సొంపులకిస్తావా పైటల చాటుల పద్యము రాసేవేళ ఉత్పలమాలలకూపిరి పోస్తావా నీవడిగే దోపిడిలో... నీ ఒడిలో ఒత్తిడిలో వసంతవేళకు... కుకుకుకుకు ఉలికిపడకు కుకుకుకు పెదవి కలిపేందుకు కుకుకుకు కలలు కనకు కుకుకుకు చరణం:2 ఆడదయ్యే వేళ నీ అందమంతా ఎండ కన్నుదాటి గుండెలోకి వస్తావా పాయసాలు పొంగే నీ పక్కకొస్తే ముద్దు బారసాల ముందుగానే చేస్తావా నన్నయభట్టుకు నవలలు నచ్చే వేళ కౌగిలి పర్వం కొత్తగ రాస్తావా చక్కిలిగింతలు తిక్కనకొచ్చిన వేళ నర్తనశాలకు నాతో వస్తావా నా ఎదలో పూపొదలో నా కథలో నీ జతలో సందేహమెందుకు కుకు కుకుకుకుకు ఉలికిపడకు కుకుకుకు పెదవి కలిపేందుకు కుకుకుకు కలలు కనకు కుకుకుకు కథలు నడిపేందుకు కుకుకు చిలక పలికిన వయసుకు వయసు తొడిగిన సొగసుకు షరాలు పెంచకు... కుకుకుకుకు ఉలికిపడకు కుకుకుకు పెదవి కలిపేందుకు కుకుకుకు కలలు కనకు కుకుకుకు