చిత్రం: అభిలాష(1983 )
రచన: వేటూరి
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్. జానకి
సంగీతం: ఇళయ రాజా
పల్లవి :
సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది
మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు
ఎవరికిస్తుందో ఏమౌతుందో ఎవరికిస్తుందో ఏమౌతుందో
సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలిగాలి రమ్మంది
ఎల్లువయ్యే ఈడు ఏడెక్కీపోయే వాడు
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో
చరణం : 1
కొండాకోన జలకాలాడే వేళ కొమ్మరెమ్మ చీర కట్టే వేళ
పిందె పండై చిలక కొట్టే వేళ పిల్ల పాప నిదరే పోయే వేళ
కలలో కౌగిల్లే కన్నులు దాటాల
ఎదలే పొదిరిల్లై వాకిలి తియ్యాల
ఎదటే తుమ్మెద పాట పువ్వుల బాట వెయ్యాల
సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది
ఎల్లువయ్యే ఈడు ఏడెక్కీపోయే వాడు
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో
చరణం : 2
మల్లె జాజి మత్తు చల్లే వేళ పిల్లా గాలి జోల పాడే వేళ వానే వాగై వరదై పొంగే వేళ నేనే నీవై వలపై సాగే వేళ కన్నులు కొడుతుంటే ఎన్నెల పుట్టాల పుట్టిన ఎన్నెల్లో పుట్టకళ్ళు తాగాల పగలే ఎన్నెల గుమ్మా చీకటి గువ్వాలాడాల సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది అందగాడికి తోడు చలిగాలి రమ్మంది మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు ఎవరికిస్తుందో ఏమౌతుందో ఎవరికిస్తుందో ఏమౌతుందో సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది అందగాడికి తోడు చలిగాలి రమ్మంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి