30, జులై 2021, శుక్రవారం

April 1 Vidudala : Chukkalu Themmenna Song Lyrics (చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా)

చిత్రం: ఏప్రిల్ 1 విడుదల (1991)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం: ఇళయరాజా

గానం: మనో, కె.యస్.చిత్ర


పల్లవి :

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా..
చూస్తావా నా మైనా.. చేస్తానే ఎమైనా..
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా..
చూస్తావా నా మైనా.. చేస్తానే ఎమైనా..
నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మ ఎట్టాగైనా..
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా..
చూస్తావా నా మైనా.. చేస్తానే ఎమైనా..

చరణం : 1

షోలే ఉందా..ఇదిగో ఇంద...
చాల్లే ఇది జ్వాలకాదా.. తెలుగులొ తీసారే బాలా..
ఖైదీ ఉందా.. ఇదిగో ఇంద..
ఖైదీకన్నయ్య కాదే.. వీడికి అన్నయ్య వాడే..
జగదేక వీరుడి కధ ఇది పాత పిక్చరు కద..
అతిలోక సుందరి తల అతికించి ఇస్తా పద..
ఏ మాయ చేసైనా ఒప్పించే తీరాలి...
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా..
చూస్తావా నా మైనా.. చేస్తానే ఎమైనా..
చరణం : 2
ఒకటా రెండా.. పదులా వందా..
బాకీ ఎగవేయకుండా.. బదులే తీర్చేది ఉందా..
మెదడే ఉందా.. మతిపోయిందా..
చాల్లే మీ కాకి గోలా.. వెళాపాళంటూ లేదా...
ఎమైంది భాగ్యం కధ.. కదిలిందాలేదా కధ..
వ్రతమేదో చేస్తుందట అందాక ఆగాలట..
లౌఖ్యంగా బ్రతకాలి.. సౌఖ్యాలే పొందాలి..
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా..
చూస్తావా నా మైనా.. చేస్తానే ఎమైనా..
నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మ ఎట్టాగైనా..
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా..
చూస్తావా నా మైనా.. చేస్తానే ఎమైనా..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి